Arjun-Tendulkar
Viral, లేటెస్ట్ న్యూస్

Arjun Tendulkar: సచిన్ కొడుకు అర్జున్ ఇప్పటివరకు ఎంత డబ్బు సంపాదించాడో తెలుసా?

Arjun Tendulkar: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాడు. సానియా చందోక్‌తో వివాహ నిశ్చితార్థం జరగడమే ఇందుకు కారణం. ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కాబోయే వధువు సానియా.. ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రవి ఘై మనుమరాలు. వీరి కుటుంబానికి ఆతిథ్య, ఫుడ్ ఇండస్ట్రీలో లాభదాయకమైన వ్యాపారాలు ఉన్నాయి. ఇంటర్‌కాంటినెంటల్ హోటల్, బ్రూక్లిన్ క్రీమరీ వంటి బ్రాండ్‌లు ఈ కుటుంబానికి చెందినవే. కాబట్టి, సానియా సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మరి, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ పుత్రుడైన అర్జున్‌ ఆస్తి ఎంత?, ఇప్పటివరకు ఎంత సంపాదించాడు? అనేది ఆసక్తికరంగా మారింది. అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు.

అర్జున్ నికర ఆస్తి ఎంత?
సచిన్ టెండూల్కర్ క్రికెట్ గొప్పదనం, ఆయన ఆస్తిపాస్తుల గురించి అభిమానులకు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. అయితే, అర్జున్ టెండూల్కర్ స్వయంకృషితో ఎంత డబ్బు సంపాదించాడనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 2021లో అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ రూ.20 లక్షల ధరకు కొనుగోలు చేసింది. ముంబై ఇండియన్స్ టీమ్ సభ్యుడిగా ఉండటంతో తన కాంట్రాక్టుల ద్వారా మొత్తం రూ.1 కోటి 40 లక్షలు సంపాదించాడు. తిరిగి 2023లో కూడా అర్జున్‌ను రూ.30 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఒక్క ఐపీఎల్‌‌లో మాత్రమే కాకుండా దేశవాళీ క్రికెట్‌లో గోవా జట్టుకి కూడా అర్జున్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌లలో కూడా ఆడుతున్నాడు. వీటి ద్వారా ఏడాదికి సుమారుగా రూ.10 లక్షల ఆదాయం పొందుతున్నాడు. ఈ విధంగా క్రమంగా సంపాదించాడు.

Read Also- Rajiv Yuva Vikasam: నిరుద్యోగ యువతకు ‘రాజీవ్ యువవికాసం’ అమలు అప్పుడేనా!

రూ.22 కోట్లు కూడబెట్టాడు
అర్జున్ టెండూల్కర్ ఇప్పటివరకు సుమారుగా రూ.22 కోట్ల నికర ఆస్తి సంపాదించాడని ‘న్యూస్18’ కథనం పేర్కొంది. కాగా, అర్జున్ టెండూల్కర్ తన కుటుంబంతో పాటు విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. కాగా, సచిన్ టెండూల్కర్‌కు ముంబైలో ఉన్న విలాసవంతమైన బంగ్లాలో అర్జున్ ఉంటున్నాడు. ఈ భవనాన్ని 2007లో రూ. 39 కోట్లకు సచిన్ కొనుగోలు చేశాడు.

అర్జున్ క్రికెట్ కెరీర్ ఇదే

లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన అర్జున్ టెండూల్కర్ బ్యాటింగ్‌లో కూడా కొంత వరకు రాణించగలడనే పేరుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ను పరిశీలిస్తే, రంజీ ట్రోపీలో ఇప్పటివరకు 17 మ్యాచ్‌లు ఆడి 37 వికెట్లు తీశాడు. 532 పరుగులు సాధించాడు. ఇక, టీ20 ఫార్మాట్‌లో జరిగే సయ్యద్ ముస్తాఖ్ అలీ, ఐపీఎల్‌లలో కలిపి 24 మ్యాచ్‌లు ఆడి 27 వికెట్లు తీశాడు. 119 పరుగులు సాధించాడు. లిస్ట్-ఏ మ్యాచ్‌ల (విజయ్ హజారే ట్రోఫీ) విషయానికి వస్తే, 18 మ్యాచ్‌లు ఆడాడు. 25 వికెట్లు, 102 పరుగులు సాధించాడు. ప్రత్యేకంగా ఐపీఎల్‌ కెరీర్ గురించి మాట్లాడుకుంటే, 2023లో ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడాడు. ముంబై ఇండియన్స్ తరపున ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడాడు. 2024 సీజన్‌లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఇప్పటివరకు కేవలం 3 వికెట్లు మాత్రమే తీశాడు.

Read Also- Teenmaar Mallanna: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న ఆసక్తికర వ్యాఖ్యలు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!