Anchor ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Anchor Udaya Bhanu: ఉదయభానును తొక్కేసింది వాళ్ళేనా.. లైవ్ లో గట్టిగా ఇచ్చి పడేసిందిగా?

Anchor Udaya Bhanu: యాంకర్ ఉదయభాను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తెలంగాణలోని కరీంనగర్‌లోని సుల్తానాబాద్‌లో జన్మించారు. ఆమె తండ్రి ఎస్.కె. పటేల్ డాక్టర్, కవి. ఆమె తల్లి ఆరుణ ఆయుర్వేద వైద్యురాలు. ఆమె తండ్రి పేరు పెన్‌నేమ్‌ నుండి “ఉదయభాను” అనే పేరు వచ్చింది.

Also Read: Khazana Jewellers Robbery: ఖజానా దోపిడి దొంగలు మామూలోళ్లు కాదు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన డీసీపీ!

ఏ అమ్మాయి పడకూడని కష్టాలు ఉదయభానుకి చిన్న తనంలో ఎదురయ్యాయి. నాలుగేళ్ల వయసులోనే తండ్రి మరణించారు. ఆమె తల్లి రెండవ వివాహం చేసుకోగా, ఉదయభాను 15 ఏళ్ల వయసులో మొదటి వివాహం చేసుకున్నారు. కానీ ఆ వివాహం విడాకులతో ముగిసింది. తర్వాత 2004లో విజయ్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు.

Also Read: Ramchander Rao: ఆర్ఎస్ఎస్‌పై తప్పుగా మాట్లాడుతున్నారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

ఉదయభాను ఇటీవల తన కొత్త సినిమా “త్రిబాణధారి బార్బరిక్” ప్రమోషన్స్ లో పాల్గొంది. అయితే, ఇటీవలే యాంకరింగ్ రంగంలో “సిండికేట్” గురించి సంచలన కామెంట్స్ చేసింది. ఆమెను కొందరు కావాలనే తొక్కేసారంటూ మాట్లాడింది. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎవరు మిమ్మల్ని తొక్కేసిందని రిపోర్టర్ అడగగా.. ఘాటుగానే స్పందించింది.

Also Read: Niharika: విడాకుల తర్వాత మెగా డాటర్ నిహారిక ఎవరితో చిల్ అవుతుందో చూశారా? ఫొటోలు వైరల్!

నేను ఎప్పుడు నిజాలే మాట్లాడతా.. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు నాకు. ఎవరు తొక్కేసారో చెప్పే సందర్భం ఇది కాదనిచెప్పింది. అంతే కాదు, ఆమె తనకు జరిగిన అన్యాయాల గురించి, చెల్లని చెక్కుల గురించి, ఇండస్ట్రీలోని కొన్ని గ్రూపులు అవకాశాలను అడ్డుకున్నట్లు ఆమె ఆరోపించింది. ఆమె తన జీవితం అనుభవాల ఆధారంగా ఒక పుస్తకం కూడా రాస్తున్నట్లు తెలిపింది. ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో పెను సంచలనంగా మారిందని చెప్పొచ్చు.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్