Niharika: మెగా డాటర్ నిహారిక (Mega Daughter Niharika) ఈ మధ్యకాలంలో బాగా వార్తలలో నిలుస్తున్న విషయం తెలిసిందే. పెళ్లి, విడాకుల తర్వాత కొన్నాళ్ల పాటు ఆమె లైఫ్ అంత గొప్పగా ఏం లేదు. అదే టైమ్‌లో ఓ పబ్‌లో అయిన ఇష్యూ కూడా ఆమెను బాగా కృంగదీసింది. ఆ పరిస్థితుల్లో అందరూ ఆమె అసలు బయటికి వచ్చి ఫేస్ చూపించుకోగలదా? అని అనుకున్నవారు కూడా ఉన్నారు. కానీ ఇవన్నీ లైఫ్‌లో పాసింగ్ క్లౌడ్స్ వంటివని భావించే నిహారిక.. తన లైఫ్‌లో జరిగిన చీకటిని తొలగించి వెలుగుకు ఆహ్వానం ఇచ్చేలా.. ఈ మధ్య ఎక్కడ కనిపించినా హ్యాపీగానే ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఆమె చేసే పోస్ట్‌లు చూస్తే.. ఆమె ఎంత హ్యాపీగా ఉందో అందరికీ అర్థమవుతోంది. ఆమె ఈ సంతోషంపై కూడా వార్తలు వైరల్ అవుతూనే ఉండటం విశేషం.
Also Read- Fighter Shiva: ‘నేను పవన్ కళ్యాణ్ లెక్క.. గెలిచే వరకు పోరాడుతా’.. ‘ఫైటర్ శివ’ టీజర్ అరాచకం
నిహారిక రెండో పెళ్లికి సిద్ధమయ్యిందని, ఆల్రెడీ ఫిక్స్ అయిందని.. పలానా వారిని రెండో పెళ్లి చేసుకోబోతుందని ఒకటే వార్తలు. అయినా కూడా ఎక్కడా ఈ రూమర్స్‌పై నిహారిక స్పందించలేదు. విడాకుల తర్వాత ఫ్రీడమ్ బాగా ఎక్కువైందని విమర్శలు చేసే వారు కూడా ఎక్కువైపోయారు. అయినా సరే, అవేం పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ వెళ్లిపోతుంది. దారి వెంట వెళుతుంటే ఎంత మంది ఏవేవో అనుకుంటూ ఉంటారు. వాటిని పట్టించుకుంటే అక్కడే ఆగిపోతాం. మనల్ని కాదు అనుకుంటే.. మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పే నిహారిక.. తిరిగి తన కెరీర్‌పై దృష్టి పెట్టింది. నిర్మాతగా తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై చేసిన ‘కమిటీ కుర్రోళ్లు’ పెద్ద విజయం సాధించడంతో పాటు అవార్డులను కూడా రాబట్టడంతో.. ఆమె కాన్ఫిడెన్స్ లెవల్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. తన భవిష్యత్ ఏమిటో తనకు అర్థమైంది. ఇక ఆ దిశగానే అడుగులు వేసేందుకు ప్రయత్నం చేస్తోంది.
ఇటీవలే తను నిర్మాతగా సంతోష్ శోభన్ హీరోగా చిత్రాన్ని ప్రకటించిన నిహారిక.. తన లైఫ్‌ను ఎంతో ఆహ్లాదకరంగా మలుచుకునే ప్రతి అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటుంది. తనపై లేనిపోని వార్తలు పుట్టించే వారికి చెంపపెట్టు అనేలా.. తను చాలా హ్యాపీగా ఉన్నానని తెలిపే ప్రతి సందర్భాన్ని షేర్ చేస్తుంది. అవును, ఇప్పుడు కూడా నిహారిక తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో తను ఎవరితో చిల్ అవుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. లైట్‌గా వర్షం పడుతుంది. వెదర్ చాలా కూల్‌గా ఉంది. ఈ వాతావరణాన్ని తన పెట్ డాగ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తోంది నిహారిక. ‘క్యాప్షన్ అవసరం లేదు, ఇద్దరు ప్రకృతి ప్రేమికుల వైబ్స్ మాత్రమే’ అని నిహారిక షేర్ చేసిన ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనికి కొందరు నెటిజన్లు.. ‘విడాకుల తర్వాత నిహారిక భలే చిల్ అవుతుంది’ అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు