Crime News: అయిదేళ్ల బాలునిపై లైంగిక దాడి జరిపి దారుణంగా హత్య చేసిన నిందితున్ని ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. రామాంతాపూర్ కేసీనగర్ లో నివాసముంటున్న అయిదేళ్ల బాలుడు మనోజ్ పాండే ఈనెల 12న కనిపించకుండా పోయాడు. తల్లిదండ్రలు అతని కోసం అన్ని చోట్లా వెతికారు. అయినా, ఆచూకీ తెలియక పోవటంతో ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఉప్పల్ స్టేషన్ పరిధిలోని మనోజ్ మృతదేహం దొరికింది. పోస్టుమార్టం జరిపించగా బాలునిపై లైంగిక దాడి జరిపి ఆ తరువాత గొంతు నులిమి హత్య చేసినట్టుగా నిర్ధారణ అయ్యింది.
Also Read: Crime News: బస్సులో పరిచయం.. చేపలు ఇస్తానంటూ మహిళను కిందకు దింపి..
కుటుంబ సభ్యులతో పరిచయం
ఈ క్రమంలో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు ఈ ఘాతుకానికి ఒడిగట్టిన కమర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మనోజ్ తండ్రి పని చేస్తున్న టిండర్ డిపోలోనే కమర్ కూడా పని చేస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో కమర్ కు మనోజ్ తోపాటు అతని కుటుంబ సభ్యులతో పరిచయం కూడా ఉన్నట్టు వెల్లడైంది. దీనిని అడ్డం పెట్టుకుని మాయ మాటలతో మనోజ్ ను కిడ్నాప్ చేసి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లిన కమర్ బాలునిపై లైంగిక దాడి చేసి హత్య చేసినట్టుగా నిర్ధారణ అయ్యింది. మనం నమ్మిన వాల్లే మనలను మోసం చేస్తున్నారంనడంలో ఈ సంగటన నిదర్షనం అని చెప్పుకోవచ్చు అబం శుభం తెలియని ఆ బాలుడిని నమ్మించి అతనిపై మృత్యువు కోశుడుగా మారాడు.
Also Read: YTD Board :ఆధ్యాత్మికత వారికి బోర్డులో అవకాశం.. సీఎం వద్దకు ఫైల్!