Surrogacy Scam (imagecredit:twitter)
తెలంగాణ

Surrogacy Scam: నేరాంగీకారంతో డాక్టర్ నమ్రత.. అసలు రహస్యం బట్టబయలు?

Surrogacy Scam: సంచలనం సృష్టించిన యూనివర్సల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్(Universal Creation Test Tube Baby Center) కేసు ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత(Dr. Namratha) తన నేరాలను అంగీకరించారు. సరోగసి పేర పిల్లలను వేల రూపాయలకు కొని సంతానం కోసం తన వద్దకు వచ్చిన వారి నుంచి లక్షల్లో డబ్బు తీసుకుని ఇచ్చినట్టు ఒప్పుకొన్నారు. దీంట్లో వృత్తిరీత్యా న్యాయవాది అయిన తన కొడుకు సహకరించినట్టుగా చెప్పారు. కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారించినపుడు డాక్టర్ నమ్రత ఈ వివరాలను వెల్లడించారు. వీటి ఆధారంగా కన్​ ఫెషనల్ స్టేట్ మెంట్ తయారు చేసిన గోపాలపురం పోలీసు(Gpula Puram Police)లు దానిని సికింద్రాబాద్ కోర్టుకు సమర్పించారు. రాజస్తాన్ కు చెందిన గోపాల్ సింగ్ దంపతులు ఇచ్చిన ఫిర్యాదుతో సరోగసి పేర డాక్టర్ నమ్రత చేస్తున్న చైల్డ్ ట్రాఫికింగ్(Child Traking) వ్యవహారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు తీవ్ర సంచలనం సృష్టించింది.

కస్టడీలో…

డాక్టర్ నమ్రత సరోగసి పేర పదుల సంఖ్యలో పిల్లలను కొని అమ్మినట్టుగా తెలియటంతో గోపాలపురం పోలీసులు కోర్టు అనుమతితో ఆమెను అయిదు రోజుల కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. దీంట్లో ఆంధ్ర మెడికల్ కాలేజీ(Andhra Medical College) నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసిన తాను ఆ తరువాత జేజేఎం మెడికల్ కాలేజీ(JJM Medical College) నుంచి గైనకాలజీలో పీజీ చదివినట్టు డాక్టర్ నమ్రత చెప్పారు. 1995లో విజయవాడలో ప్రాక్టీస్ ప్రారంభించినట్టు తెలిపారు. 1998లో మొదటి యూనివర్సల్ సృష్టి సంతాన సాఫల్య కేంద్రాన్ని విజయవాడలో ప్రారంభించినట్టు చెప్పారు. 2007లో సికింద్రాబాద్ కు వచ్చి ఇక్కడ మరో సెంటర్ ను ఏర్పాటు చేశానని తెలిపారు. ఆ తరువాత వైజాగ్ లో మరో బ్రాంచ్ ప్రారంభించినట్టు చెప్పారు.

ఏజెంట్లను పెట్టుకుని

సంతానం కోసం తనను పెద్ద సంఖ్యలో దంపతులు ఆశ్రయిస్తుండటంతో సరోగసి పేర వారిని మోసం చేసి డబ్బు సంపాదించాలని పథకం వేసినట్టుగా డాక్టర్ నమ్రత వెల్లడించారు. ఈ క్రమంలో సంజయ్​(Sanjay), అతని భార్య నందినిలను ఏజెంట్లుగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఈ ఇద్దరు అబార్షన్ చేయించుకోవాలనుకునే మహిళలను గుర్తించేవారని చెప్పారు. వారిని సంప్రదించి బిడ్డను కని ఇస్తే డబ్బు ఇస్తామని ఆశ పెట్టి ఉచ్ఛులోకి లాగేవారన్నారు. బిడ్డను ఇవ్వటానికి ఒప్పుకోగానే తన వద్దకు సంతానం కోసం వచ్చేవారికి చికిత్స ద్వారా పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పేదాన్నన్నారు. సరోగసి ద్వారా బిడ్డను కనే అవకాశాలు ఉన్నాయని నమ్మించేదాన్నని చెప్పారు. ఆ తరువాత విజయవాడ, విశాఖపట్టణంలోని సృష్టి సెంటర్లకు సంతానం లేని భార్యాభర్తలను పంపించి అక్కడ అండాలు, వీర్యకణాలను సేకరింప చేసేదానన్ని తెలిపారు.

Also Read: Janagama News: అండ‌ర్ బ్రిడ్జి వ‌ద్ద ప్ర‌మాద‌క‌రంగా రోడ్డు.. పట్టించుకోని అధికారులు

ఒక్కో సరోగిసికి 20 నుంచి 30లక్షల రూపాయలు తీసుకునేదానన్ని చెప్పారు. వేరే వాళ్లకు పుట్టిన బిడ్డను లక్ష రూపాయలలోపు డబ్బు ఇచ్చి కొని వారికి అప్పగించేదాన్నని తెలియచేశారు. అయితే, కొంతమంది దంపతులకు తనపై అనుమానాలు రావటంతో విజయవాడలోని మహారాణిపేట, వైజాగ్ లోని టూటౌన్, గోపాలపురం, గుంటూరులోని కొత్తపేట పోలీసులకు ఫిర్యాదులు చేశారని, వీటిపై కేసులు కూడా నమోదయ్యాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తన హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ను రద్దు కూడా చేశారని తెలిపారు. ధనశ్రీ

నా కొడుకు బెదిరించేవాడు

ఇక, ఎలాంటి చికిత్స చేయకుండా, సరోగసి ద్వారా కాకుండా ఇతరుల నుంచి కొన్న పిల్లలను అప్పగిస్తూ వచ్చిన నేపథ్యంలో కొంతమంది భార్యాభర్తలు గొడవలు పడేవారని తెలిపారు. సికింద్రాబాద్ సెంటర్ లో న్యాయవాది అయిన తన కుమారుడు జయంత్ కృష్ణ కూర్చుని ఉండేవాడని, ఇలా గొడవలకు దిగిన వారిని బెదిరించి పోలీసులకు ఫిర్యాదు చెయ్యకుండా చూసేవాడన్నారు. సరోగసికి సంబంధించిన కేస్ షీట్లను తన కన్సల్టెన్సీ రూంలోని టేబుల్ డ్రాలో దాచి పెట్టినట్టు తెలిపారు. ఇక, రాజస్తాన్ కు చెందిన గోపాల్ సింగ్ దంపతుల నుంచి 30లక్షలు తీసుకుని సరోగసి ద్వారా బిడ్డ పుట్టేలా చేస్తానని నమ్మించానని వెల్లడించారు. అయితే, నస్రీన్ బేగం అనే మహిళకు పుట్టిన శిశువును వారికి అప్పగించినట్టు చెప్పారు.

నిజానికి పేదరికం కారణంగా నస్రీన్ అబార్షన్​ చేయించుకోవాలని అనుకున్నట్టు తెలిపారు. విమానంలో పంపించి వైజాగ్ లోని సెంటర్ లో నస్రీన్ కు డాక్టర్ ఉష ద్వారా ప్రసవం చేయించినట్టు చెప్పారు. డీఎన్​ఏ పరీక్షల ద్వారా బిడ్డ తమకు పుట్టలేదని తెలుసుకున్న గోవింద్ సింగ్ దంపతులు సికింద్రాబాద్ బ్రాంచ్ కు వచ్చి గొడవ పడ్డారని తెలిపారు. అప్పుడు తన కొడుకు జయంత్ కృష్ణ మరోసారి ఇక్కడికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వారిని భయ పెట్టాడని తెలిపారు. డాక్టర్ నమ్రత ఇచ్చిన ఈ వాంగ్మూలాన్ని రికార్డు చేసిన పోలీసులు దానిని కోర్టుకు సమర్పించారు.

Also Read: GHMC Commissioner: మరో మూడు రోజులు అలర్ట్‌గా ఉండాలి.. కర్ణన్ కీలక ఆదేశాలు

Just In

01

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. 11,12,13,14వ కంటెస్టెంట్స్‌గా ఎవరంటే! ట్విస్ట్ 15 కూడా!

TS BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి కొత్త ఇబ్బంది?. ఏ విషయంలో అంటే!

Heavy Rain In Warangal: వరంగల్ నగరంలో దంచికొట్టిన వర్షం.. పలుచోట్ల వరదలు

Bigg Boss9 Telugu: హౌస్‌లోకి.. రీతూ చౌదరి, డీమాన్ పవన్, సంజన!

GHMC sanitation: గణేశ్ నిమజ్జనాల సందర్భంగా, హైదరాబాద్‌లో ఎంత చెత్త సేకరించారంటే?