BJP Leadership Crisis: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ(Telangana) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్(Operation Akarsh) ను ముమ్మరంగా చేపడుతూ క్రమంగా బలోపేతమవుతోంది. కానీ పార్టీలో నేతల మధ్య సమన్వయం లేకపోవడం, ఎడమొహం, పెడమొహం అన్నట్లుగా వ్యవహరించడం, ఆధిపత్య పోరు వంటి అంశాలు పార్టీని సతమతం చేస్తున్నాయి. వీటికి తోడుగా బీజేపీలో మరో ఇష్యూ వచ్చి పడింది. తెలంగాణ బీజేపీ((Telangana BJP)) లో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పార్టీ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్(Hyderabad) చుట్టు పక్కల జిల్లాల అధ్యక్షుల ఎన్నిక, కమిటీల ఎన్నికలో అనేక లోటుపాట్లు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన నివేదికలు సైతం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ram chender Rao)కు అందినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు ఇన్ చార్జీ పోస్టులు రద్దు చేసే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది.
కాలేజీలు నడుపుకునే ఓ నేత
తెలంగాణ బీజేపీలో త్వరలోనే హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాల అధ్యక్షుల మార్పు ఉండే అవకాశాలున్నాయని శ్రేణులు చర్చించుకుంటున్నాయి. కాగా ఈ అంశంపై పలువురు రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదు సైతం చేసినట్లు తెలుస్తోంది. అధ్యక్షుల మార్పు చేయకుంటే తాము పని చేయబోమని పలువురు ఎంపీ(MP)లు ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడికి తేల్చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్(Hyderabad)లో కాలేజీలు నడుపుకునే ఓ నేత.. హైదరాబాద్ శివారు జిల్లాలకు పార్టీ కమిటీల నియామకం ఇన్ చార్జీగా ఉన్నారు. పార్టీ కమిటీల ఏర్పాటు తీరుపై స్థానిక నేతల నుంచి నిరసనలు వ్యక్తమవడంతో ఈ అంశం బట్టబయలైంది. కాగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన వ్యక్తికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఎలా అప్పగించారనే అంశం హైకమాండ్ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. అంతేకాకుండా సదరు నేత ఆ జిల్లాకు స్థానికేతరుడు కావడం గమనార్హం.
A;so Read: TG Free Bus Scheme: నయా రికార్డ్.. ఆరు రోజుల్లో 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు
జిల్లా కమిటీల ఏర్పాటు
ఇదిలా ఉండగా అసలు దీని వెనక ఎవరున్నారనే అంశంపై పార్టీ రాష్ట్ర నేతలు ఆరా తీసినట్లు సమాచారం. రియల్ ఎస్టేట్(Real estate) వ్యవహారంతోనే అతనికి పార్టీలో పోస్ట్ దక్కినట్లు ప్రచారం జరిగింది. జిల్లా కమిటీల ఇన్ చార్జీగా ఉన్న వ్యక్తి ఇటీవలే ఆ ప్రాంతంలో భారీగా భూములు కొనుగోలు చేసినట్లు స్థానిక బీజేపీ(BJP) నేతలు చెప్పుకుంటున్నారు. జిల్లా కమిటీల ఏర్పాటు సైతం తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఓ నాయకుడు పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసినట్లు చెప్పుకుంటున్నారు. ఇక మరో జిల్లా అధ్యక్షుడు లోకల్ ఎంపీ మాటను సైతం లెక్క చేయడం లేదని తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ లో భాగంగానే పార్టీలో ఓ నేత అతడిని అధ్యక్షుడిగా సిఫారసు చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఓ జిల్లా అధ్యక్షుడు తాను జెడ్పీటీసీ(ZPTC)గా పోటీ చేస్తానని.. తన మండలానికి ఇష్టమున్న వ్యక్తినే ఇన్ చార్జీగా నియమించుకోవడం గమనార్హం. ఈనేపథ్యంలోనే హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల అధ్యక్షుల తీరు, కమిటీ ఇన్ చార్జీలపై వేటుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం.
Also Read: MLA Naseer: టీడీపీ ఎమ్మెల్యే వీడియో కాల్ దుమారం.. మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నం!
