Jubilee Hills By Election (imagecredit:twitter)
Politics

Jubilee Hills By Election: ఉప ఎన్నికను టాస్క్‌గా తీసుకున్న సర్కార్.. సీక్రెట్ అదేనా?

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కీలక స్ట్రాటజీని అమలు చేస్తున్నది. కులాల వారీగా ఓటు బ్యాంక్ ను పొందేందుకు ప్లాన్ చేసింది. కులాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు, గ్రూప్ గేదర్స్ ఏర్పాటు చేసి, కాంగ్రెస్ వైపు నిలబడాలని సూచించనున్నారు. ఇప్పటికే ముగ్గురు మంత్రులను ఇన్ చార్జ్ లుగా నియమించగా, ఇందులో బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), ఎస్సీ సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్(Gaddam Vivek), ఓసీ సామాజిక వర్గం నుంచి తుమ్మల నాగేశ్​వరరావు(Tummala Nageshwar Rao)లు ఉన్నారు. ఈ ఇన్ ఛార్జ్ మంత్రులంతా ఇప్పటికే రెండు సార్లు డివిజన్ల వారీగా మీటింగ్ లు పూర్తి చేశారు. మూడో సారి కులాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించనున్నారు.

అజారుద్దీన్ సమన్వయం

ఈ మూడు సామాజిక వర్గాల నుంచి మెజార్టీ ఓట్లు సాధిస్తే, కాంగ్రెస్(Congress) పక్కగా గెలుస్తుందని ఆ పార్టీ నేతల నమ్మకం. మరోవైపు మైనార్టీలను జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసి. అజారుద్దీన్ సమన్వయం చేస్తున్నారు. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దిన్ కూడా ముస్లీం కమ్యూనిటీ ఓట్లు ఛే జారకుండా తనదైన శైలీలో ప్రయత్నాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్(Jublihills) ఉప ఎన్నికలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. దీంతోనే ఈ ఎన్నికల్లో ఎలాగైన గెలవాలనే లక్ష్యంతో తన ప్రత్యేక స్ట్రాటజీని అమలు చేస్తున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ జెండాను ఎగురవేసేందుకు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read: SC on MLCs: సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. కోదండరాం, అలీఖాన్ ఎమ్మెల్సీ పదవులు రద్దు

మిక్స్ డ్ ఓటర్లు..?

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏపీ ఓటర్లు కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఇందులో కమ్మ సామాజిక వర్గం నుంచి ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. దీంతో పాటు బీ(BC)సీ, మైనార్టీలు అధికంగా ఉన్నారు. దీంతో ఆయా ఇన్ చార్జీ మంత్రులు కుల సంఘాల ముఖ్య నాయకులకు భరోసా ఇస్తూ కాంగ్రెస్ కు మద్ధతు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం పదేళ్ల పాటు ఉంటుందని, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అత్యధిక నిధులు ఇప్పిస్తామంటూ హామీ ఇస్తున్నారు. పార్టీ కార్యకర్తల నుంచి పబ్లిక్ వరకు ఎవరికి ఏ సమస్య వచ్చినా, అండగా ఉంటామని మంత్రులు భరోసా ఇస్తున్నారు.

అభ్యర్ధి ప్రకటించకుండానే..?

నేతలు,కేడర్ మధ్య విభేదాలు రాకుండా కాంగ్రెస్ తన ప్లాన్ ను అమలుచేస్తున్నది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న పార్టీ..అభ్యర్ధి ఎవరు అనేది ఎక్కడా క్లారిటీ ఇవ్వడం లేదు. లోకల్లో పట్టున్న నేతకే ఇస్తామంటూ పరోక్ష సంకేతాలు ఇస్తూ ముందుకు సాగుతున్నది. ఆశావహులను కూడా సమన్వయం చేసి పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాతనే అభ్యర్ధిని ప్రకటిస్తామంటున్న కాంగ్రెస్ (Congress) అంతకంటే ముందు నేతల్లో ఎలాంటి విభేదాలు, కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా జాగ్రత్త పడుతున్నది. దీని వలన ఉప ఎన్నికల్లోకేడర్ లో చీలికలు ఏర్పడవనేవి ఆ పార్టీ ఉద్దేశం. దీంతో ఎన్నికల అభ్యర్ధి లేకుండానే అందరినీ సమన్వయం చేస్తూ మంత్రులు తమ పర్యటనలను కొనసాగించడం గమనార్హం. పైగా ఎంఐఎం కూ‌‌డా తమకు మద్ధతుగా నిలుస్తుందని కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Bandi Sanjay: మార్వాడీలకు ఫుల్ సపోర్ట్ పలికిన కేంద్రమంత్రి బండి సంజయ్

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?