ATM Robbery (imagecredit:swetcha)
క్రైమ్

ATM Robbery: యూట్యూబ్ వీడియోలు చూసి.. బ్యాంక్‌లకు కన్నం.. దొంగలు అరెస్ట్!

ATM Robbery: మెదక్ జిల్లాలో 15 రోజుల్లో 2 బ్యాంక్ లు,ఒక బ్యాంక్ ఏటిఎం(ATM) మిషన్ కు కన్నం వేసి.. చోరికి యత్నించిన ముగ్గురు వ్యక్తుల ముఠాను ఎట్టకేలకు పోలీస్ లు పట్టుకొన్నారు. ఎస్పీ శ్రీనివాసరావు(SP Srinivasa Rao) అదనపు ఎస్పీ మహేందర్(Mahender), మెదక్ డి ఎస్పీ ప్రసన్న కుమార్(DSP Prasana Kumar) సీ ఐ మహేష్(CI Mahesh) తో కలసి జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో నిర్వహించి వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామానికి చెందిన గూడెపు శ్రీకాంత్, చర్ల లింగం, కట్ట ప్రసాద్ లు ముఠాగా ఏర్పడి తాగుడుకు బానిసలై దొంగతనాలు చేసి డబ్బులు సంపాదించాలని పన్నాగం పన్ని చోరీలు విఫలమై చివరకు పోలీసులకు చిక్కి ముగ్గు నిందితులు కటకటాల పాలయ్యారు.

గుమ్మడిదలలో హెచ్‌డిఫ్‌సి బ్యాంక్

గూడెపు శ్రీకాంత్(Srikanth) చర్ల లింగం కట్ట ప్రసాద్(Prasad) లు మెదక్ పట్టణంలోని adb SBI బ్యాంక్ లో ,వెల్దుర్తి మండల కేంద్రంలో నీ సెంట్రల్ బ్యాంక్ లో ముగ్గురు కలసి బ్యాంక్ లలో నీ పై అంతస్తు నుండి లోనికి దిగి బ్యాంక్ లాకర్ లను పగుల గొట్టేందుకు విఫలం యత్నం చేశారు. అలారం మోగడంతో అక్కడినుండి పరార్ అయ్యారు. గుమ్మడిదల లో హెచ్ డి ఫ్ సి బ్యాంక్(HDFC Bank) ఏటిఎం(ATM) మిషన్ ను దొంగలించి అందులో నీ డబ్బును కొట్టేయాలని మహేంద్ర ట్రాక్టర్ ను ఉపయోగించి ఏ టి ఎం మిషన్ కు తాడును కట్టి మిషన్ ను ట్రాక్టర్ సహాయంతో దొంగలించాలని విఫల యత్నం చేశారని ఎస్పీ శ్రీనివాసరావు(SP Srinivasa Rao) తెలిపారు. ఏటిఎం మిషన్ లో సహితం అలారం మోగడంతో అక్కడి నుంచి పారిపోయారు.

Also Read: Swetcha Special story: భద్రాద్రి కొత్తగూడెంలో రాజ్యమేలుతున్న కల్తీ రాయుళ్లు.. అవి తిన్నారా..?

కన్నం వేసి బారీగా మద్యం

కౌడి పల్ల లో నీ వైన్స్ షాప్(Wines Shop) కు అదే రోజు కన్నం వేసి బారీగా మద్యం బాటిల్స్,15 000 వేల రూపాయల నగదును దొంగలించారు. వైన్స్ షాప్ లో చేసిన దొంగతనం ద్వారా సాంకేతికతను వాడిన పోలీసులు దొంగలను పట్టుకొని శనివారం అరెస్ట్ చేశారు. బ్యాంకులను లూటీ చేసేందుకు వాడిన సుత్తి, శానం, గడ్డపార, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలగే నిందితులు చోరీ చేసిన బారీ మద్యం బాటిల్స్ ను, ట్రాక్టర్, ఆటో లను సీజ్ చేశారు.

కేవలం 15 రోజుల్లోనే దొంగలను పట్టుకొన్న మెదక్(Medak) టౌన్ సీఐ మహేష్(CI mahesh) పట్టణ ఎస్ఐ అమర్ రెడ్డి(SI Amar Reddy) కౌడిపల్లి ఎస్సై రంజిత్ రెడ్డి కానిస్టేబులు బాలయ్య నర్సింలు నిఖిల్ మల్లేషములను ఎస్పీ శ్రీనివాసరావు అదనపల్లి ఎస్పీ మహేందర్ లు అభినందించారు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కేసు ఛేదించిన అధికారులకు సిబ్బందికి రివార్డ్ లను,ప్రశంస పత్రాలను పోలీస్ అధికారులకు అందించారు.

Also Read: Independence Day: ఆస్ట్రేలియాలో ఖలిస్థానీల దుశ్చర్య.. భారత కాన్సులేట్ వద్ద…

Just In

01

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం