Fighter Shiva: ‘నేను పవన్ కళ్యాణ్ లెక్క.. గెలిచే వరకు పోరాడుతా’ అంటున్నారు యంగ్ హీరో మణికాంత్ (Manikanth). ఆయన హీరోగా, ఐరా బన్సాల్ (Ayra Bansal) హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఫైటర్ శివ’. కౌండిన్య ప్రొడక్షన్స్, అరుణ గిరి ఆర్ట్స్ బ్యానర్లపై ఉన్నం రమేష్, నర్సింహ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రభాస్ నిమ్మల దర్శకత్వం వహించిన ఈ మూవీలో సునీల్ (Sunil), వికాస్ వశిష్ట కీలక పాత్రలను పోషించారు. శనివారం (ఆగస్ట్ 16) ఈ చిత్ర టీజర్ (Fighter Shiva Teaser)ని నిర్మాత అశ్వనీదత్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం సమాజంలో పేరుకు పోయిన డ్రగ్స్, మాఫియా కల్చర్‌పై రూపొందినట్లుగా టీజర్ తెలియజేస్తుంది. టైటిల్‌కు తగ్గట్టుగానే యాక్షన్ ఎపిసోడ్స్ ఈ చిత్రంలో బలంగా ఉన్నాయి. టీజర్‌ని గమనిస్తే..
Also Read- Paradha Film: ఇది బాహుబలి లాంటి ప్రాజెక్టు.. రివ్యూస్ చూసే థియేటర్స్‌కు రమ్మంటోన్న దర్శకుడు
‘సిటీలో ఎక్కడ చూసిన డ్రగ్స్, గన్స్, మాఫియా. క్రైమ్‌ని కిల్లీ నమిలినంత ఈజీగా చేస్తున్నారు.. వీటన్నింటి వెనుకున్న ఆ బ్రూతల్ ఘోస్ట్ ఎవరు?’ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ వినిపిస్తుంటే.. తెరపై వాటికి సంబంధించి వస్తున్న విజువల్స్.. ఇది ఏ తరహా చిత్రమో తెలియజేస్తున్నాయి. ‘యముడుకి పోలీస్ ఉద్యోగం దొరికితే ఎలా ఉంటుందో చూపిస్తా..’ అంటూ సునీల్.., ‘నేను పవన్ కళ్యాణ్ లెక్క.. గెలిచే వరకు పోరాడుతా’ అనే పవర్ ఫుల్ డైలాగ్‌తో మణికాంత్.. ఈ టీజర్‌లో హీరోయిక్ ఎంట్రీ ఇచ్చారు. కొన్ని అరాచక సన్నివేశాలను టీజర్‌లో చూపించిన తీరు చూస్తుంటే.. సమాజానికి ఏదో మెసేజ్ అయితే ఈ ‘ఫైటర్ శివ’ ఇవ్వబోతున్నాడనేది అర్థమవుతోంది. ఫుల్ యాక్షన్ ఓరియెంటెడ్ మాస్ కమర్షియల్ సినిమాగా ‘ఫైటర్ శివ’ సినిమా రూపొందిందనే విషయాన్ని టీజర్ తెలియజేస్తుంది.
టీజర్ విడుదల అనంతరం దర్శకుడు ప్రభాస్ నిమ్మల (Prabhas Nimmala) మాట్లాడుతూ.. అశ్వనీదత్, సంపత్ నంది వంటి వారి వల్లే ఈ ‘ఫైటర్ శివ’ ఇంత వరకు వచ్చింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సంపత్ నంది, టీజర్‌ను అశ్వనీదత్ రిలీజ్ చేసినందుకు మా టీమ్ తరపున వారికి థాంక్స్. నేను ఇప్పుడు చిన్న సినిమానే తీయవచ్చు కానీ.. ఏదో ఒక రోజు మాత్రం పెద్ద దర్శకుడిని అవుతాను. అప్పుడు నా వద్దకు సాయం కోసం వచ్చే నాలాంటి కొత్తవారికి కచ్చితంగా అందుబాటులో ఉంటాను. ‘ఫైటర్ శివ’ను ఓ సందేశాత్మక చిత్రంగా రూపొందించాం. డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు మన ప్రభుత్వాలు ఎంతగానో ప్రయత్నిస్తున్నాయి. వాటిపైనే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం ఉంటుంది. ఈ సినిమా తర్వాత ‘మిరాకిల్’ అనే ఓ చిత్రాన్ని చేయబోతోన్నాను. అది కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు గౌతమ్ సంగీతం, విశ్వనాథ్ ఎడిటింగ్ బాగా కుదిరాయి. అందరి సహకారం వల్లే అవుట్ పుట్ ఇంత బాగా వచ్చింది. నర్సింహ గౌడ్ వాళ్ల అబ్బాయిని హీరోగా పరిచయం చేయాలని నన్ను సంప్రదించారు. ఆ కుర్రాడిని దృష్టిలో పెట్టుకుని యాక్షన్, మాస్, కమర్షియల్, మెసెజ్ ఓరియెంటెడ్ చిత్రంగా ఈ ‘ఫైటర్ శివ’ సబ్జెక్ట్ రెడీ చేశాను. రమేష్ మా వెన్నంటే నిల్చున్నారు. తెలంగాణ నుంచి మణికాంత్ అనే స్టార్ హీరో రాబోతోన్నాడు. మా మూవీని అందరూ ఆశీర్వదించాలని కోరుతున్నానని అన్నారు.
Click Here for Teaser Video
హీరో మణికాంత్ మాట్లాడుతూ.. నన్ను హీరోని చేయడం కోసం మా నాన్న చాలా కష్టపడ్డారు. ఆయన పెట్టిన ప్రతీ రూపాయిని వడ్డీతో సహా ఇండస్ట్రీ నుంచి తీసుకు వెళ్తానని అంటే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ మీద పోరాడుతున్నారు. అదే సందేశాన్ని ఈ మూవీతో మేం ఇవ్వబోతోన్నాం. యువతను మేల్కొలిపేలా ఈ సినిమా ఉంటుందని అన్నారు నిర్మాత నర్సింహ గౌడ్. ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామలింగం, నిర్మాత ఉన్నం రమేష్‌లతో పాటు చిత్ర బృందం మాట్లాడారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు