MLC Shravan on CM Revanth: రేవంత్ కు విజన్ లేదు.. విజ్డం లేదు..ఎంత సేపు కేసీఆర్(KCR) ను తిట్టడం..చంద్రబాబు(Chendrababu) ను పొగడటం తప్ప ఆయనకు ఏదీ చేత కాదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్(MLC Dasoju Shravan) అన్నారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైందని, వాళ్లకు స్వాంతన చేకూర్చే మాట ఒక్కటి రేవంత్ ప్రసంగంలో లేదన్నారు. హైదరాబాద్9Hyderabad) అనేది రెవెన్యూ ఇంజిన్ ..నిర్మాణ రంగం బాగుంటేనే అన్నీ బాగుంటాయన్నవారు. రేవంత్ కు విషం ఎక్కువ విషయం తక్కువ అని ఆయన ప్రసంగం మరో సారి రుజువు చేసిందన్నారు.
హైదరాబాద్ ను ఎండబెడతారా ?
కేసీఆర్(KCR) ,కేటీఆర్(KTR) ల చొరవ తో హైదరాబాద్(Hyderabad) పెట్టుబడులకు గమ్య స్థానం అయ్యిందన్నారు. హైదరాబాద్ ఇమేజ్ రేవంత్ పాలన లో డ్యామేజీ అయ్యిందన్నారు. జీహెచ్ ఎం సీ(GHMC) లో భవన నిర్మాణ అనుమతులు తగ్గిపోయాయని, హెచ్ ఎం డీ ఏ(HMDA) లో కార్యకలాపాలు పడక వేశాయన్నారు. రేరా(Rera) ను అడ్డం పెట్టుకుని రేవంత్ బిల్డర్ల ను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ ఫ్యూచర్ సిటీ తెస్తానంటున్నాడు .అప్పటి దాకా హైదరాబాద్ ను ఎండబెడతారా ? అని నిలదీశారు. ష్ట్ర ఆర్థిక రంగ దుస్థితికి ఏకైక కారకుడు రేవంత్ రెడ్డి మాత్రమే అన్నారు. ఆర్ ఆర్ టాక్స్(RRR Tax) కట్టనిదే ఏ పర్మిషన్ ఇవ్వడం లేదని, అనుమతులు పూర్తిగా అవినీతి మాయమయ్యాయని మండిపడ్డారు.
Also Read: Manuguru Incident: పెద్ద కొడుకు నిర్వాకం.. భోరున ఏడుస్తున్న తల్లితండ్రులు
ప్రజలపై పెత్తనం
రేవంత్ కు కుడి చేయిగా రేరా, ఎడమ చేయిగా హైడ్రా(Hydra) మారి ప్రజలపై పెత్తనం చలాయిస్తున్నాయని ఆరోపించారు. వ్యక్తులకు వ్యతిరేకంగా నేను సుప్రీం కోర్టులో పోరాడటం లేదన్నారు. రేవంత్(Revanth) ,బీజేపీ(BJP), తమిళ్ సై ఆటలో నేను ,సత్యనారాయణ యే కాదు ..కోదండరాం కూడా బలి పశువు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం గెలవాలనేదే మా తాపత్రయం అన్నారు. సెప్టెంబర్ 17 న సుప్రీం తీర్పు చారిత్రాత్మకం గా ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Also Read: Kavitha meets KCR: కేసీఆర్ తో కవిత భేటీ ఆసక్తికర చర్చ.. రహస్యం ఏంటి?