KKR Captain Shreyas Iyer Takes Aim At Bcci Over Back Injury
స్పోర్ట్స్

Sports News: ఆ టైమ్‌లో ఎవ్వరు నన్ను అస్సలు..!

KKR Captain Shreyas Iyer Takes Aim At Bcci Over Back Injury: ఐపీఎల్ 2024 సీజన్‌ ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్‌ సిద్ధమైంది. అయితే శనివారం సాయంత్రం చెన్నైలో వర్షం పడటంతో ఆ జట్టు ప్రాక్టీస్‌కు బ్రేక్‌ పడింది. దీంతో ఇండోర్‌లోనే కాలం గడిచిపోయింది. ఈ క్రమంలో కేకేఆర్‌ కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్ వెన్ను నొప్పిపై స్పందించాడు. ఆ టైమ్‌లో తన ఇబ్బంది గురించి ఎవ్వరికి చెప్పినా ఎవరూ అర్థం చేసుకోలేదని తన బాధను వ్యక్తం చేశాడు. వన్డే ప్రపంచకప్‌ తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. నా ఆందోళనలను ఎవరికైనా చెప్పినా అంగీకరించలేదు.

అదే టైంలో నాతో నేనే తీవ్రంగా పోటీపడ్డా. ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభమయ్యాక నా అత్యుత్తమ సత్తాను నిరూపించుకోవాలని భావించా. లీగ్‌కు ముందు మేం ఎలాంటి ప్రణాళికలతో వచ్చామో వాటిని అమలు చేసి రిజల్ట్స్‌ని రాబడుతూ ఇప్పుడీ స్థానంలో ఉన్నాం. సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయి జట్టులో స్థానం లేకపోవడంపై చాలామంది నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే నేనెప్పుడూ ఒకటే చెబుతా. గతం గురించి పట్టించుకోను. ప్రస్తుతం మన చేతుల్లో ఏముందనేదే ముఖ్యం. అంతేకానీ జరిగిపోయిన దాని గురించి ఆందోళన పడను. అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించడపైనే దృష్టి పెడతానని వ్యాఖ్యానించాడు.

Also Read: టీమిండియా హెడ్‌ కోచ్‌గా నెక్స్ట్‌ ఎవరంటే..?

కోల్‌కతా అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరినా, ఇదంతా గౌతమ్‌ గంభీర్‌ వల్లేననే వ్యాఖ్యలు వినిపించడంపై శ్రేయస్ స్పందించాడు. ఇదంతా మీడియా, సోషల్ మీడియా చేస్తున్నదే. హైప్‌ క్రియేట్‌ చేసి వదిలేస్తారు. టీ20 ఫార్మాట్‌ను అర్థం చేసుకోవడంలో గంభీర్‌ భాయ్‌ కంటే మరొకరు ఉండరేమో. అతడికి ఆటపై అంత నాలెడ్జ్‌ ఉంది. కేకేఆర్‌కు గతంలో రెండు టైటిళ్లను అందించాడు. ప్రత్యర్థిని బట్టి అప్పటికప్పుడు వ్యూహాలను తయారుచేసుకొని అమలు చేయడంలో అతడు కీ రోల్‌ పోషించాడు. ఇదే ఉత్సాహాన్ని ఫైనల్‌లోనూ చూపించి విజయం సాధించేందుకు ప్రయత్నిస్తామని శ్రేయస్‌ తెలిపాడు.

Just In

01

Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు?

DSP Bribery Case: ఏసీబీలో కలకలం రేపుతున్న డీఎస్పీ వసూళ్ల వ్యవహారం

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?

Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు