Addanki Dayakar: రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్లు అంటున్న చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతోందని ఎందుకు పోరాటం చేయలేదని MLC అద్దంకి దయాకర్(MLC Addanki Dayakar) ప్రశ్నించారు. గోదావరి, కృష్ణా, పెన్నా జలాలు తీసుకెళ్లే హక్కు ఉందని మీరు పోరాడుతున్నప్పుడు, కృష్ణా మీద మా వాటా గురించి మేం పోరాడుతుంటే మీకు వ్యతిరేకమేంటిని ప్నశ్నించారు. భవిష్యత్తులో కృష్ణా(Krishna), గోదావరి(Godavari) జలాల వివాదం రాకూడదు అంటే పునఃపంపకాలు జరగాల్సిన అవసరం ఉందని అద్దంకి దయాకర్ అన్నారు. ఆయన ఎక్స్ వేదికగా చంద్రబాబు నాయుడిపై మాట్లాడారు.
భవిష్యత్తులో సమస్యలు రావోద్దని
తెలంగాణ ప్రాజెక్టుల(Telangana Projects)మీద టిడిపి(TDP) ఆలోచించడం లేదని అన్నారు. తెలంగాణ మీద మీకు ప్రేమ ఉంటే మరి తెలంగాణకోసం కేంద్రంతో ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు. మీకు గోదావది,కృష్ణా వాటాలు అడిగినపుడు కృష్ణా నది మీద మేము కోట్లాడుతుంటే మీకు ఎమవుతుందని అన్నారు. అందుకని తెలంగాణ రాష్ట్రం ఉబయ రాష్టాలకు సంభందించిన అంశంలో ఎలాంటి సమస్యలు భవిష్యత్తులో రావోద్దని, కృష్ణా గోదావరి నదీజలాల నీటి పంపకం జరాగాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఆనాడు పరిష్కారం చేయలేదు
శ్వాశ్వత పరిష్కారం కోసమే తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందే తప్ప ఆంధ్ర ప్రదేశ్(AP) కి లేదంటే ఆంద్రప్రజలకు వ్యతిరేఖమో కాదని అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ(Congress)విదానం లేదా మా తెలంగాణ(Telangana) ప్రభుత్వ విధానం కాదని అన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు జగన్(Jagan), కేసీఆర్(KCR) మాజీ ముఖ్యమంత్రులు ఆనాడు పరిష్కారం చేయలేదు కాబట్టి, ఇప్పుడు రేంత్ రెడ్డి(Revanth Reddy) వాటిపై సంపూర్ణమైన అంగాహనను కలిపించుకున్న తరువాత కృష్ణా, గోదావరి నదీ జలాల సరైన పంపకాలకోసమే మేము మా ముఖ్యమంత్రి ముందుకు పోతున్నామనే అంశాన్ని గుర్తించాలని ఎమ్మెల్సీ అద్దకి దయాకర్ రావు అన్నారు.
Also Read: Ranchander Rao: మరోసారి దేశ విభజన ప్రసక్తే ఉండొద్దు.. రాంచందర్ రావు సంచలన వ్యాఖ్యలు
