constable-kanakam( image source :X)
ఎంటర్‌టైన్మెంట్

Constable Kanakam: సడన్‌గా మిస్సవుతున్న అమ్మాయిలు అడవిగుట్టలో ఏం చేస్తున్నారు?.. తెలియాలంటే!

Constable Kanakam: ఈ మధ్య కాలంలో ఎంటర్‌టైన్మెంట్ ను ఓటీటీలు ఏలుతున్నాయి. ఎప్పటి కప్పుడు వస్తున్న సరికొత్త వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ముందుంటున్నాయి. తాజాగా విడుదలైన ఓ సిరీస్ టాక్ ఆప్ ది ఇండస్టీగా నిలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయడంతో ఈ సిరీస్ పై హైప్ మరింత పెరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్, బ్లాక్ మ్యాజిక్, అమ్మాయిల మిస్సింగ్ మిస్టరీతో ఒక చిల్లింగ్ థ్రిల్లర్‌ ని అందిస్తోంది. వర్ష బొల్లమ్మ నటన, రాజీవ్ కనకాల సపోర్టింగ్ పాత్రతో ఈ సిరీస్ దూసుకుపోతోంది. ఈ సిరీస్ కథేంటి? ఎందులో ఉందో తెలియాలా.. అయితే చదవాల్సిందే.

Read also- Trump on Tariffs: అలా చేయకూడదేమో.. భారత్‌పై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!

కథలోకి వెళ్తే..
శ్రీకాకుళం జిల్లాలోని రేపల్లె అనే గ్రామంలో జరిగిన కథ ఇది. చిన్న పల్లెటూరుకు కానిస్టేబుల్‌గా వచ్చిన ఓ అమ్మాయి అక్కడ జరుగుతున్న మిస్టరీని ఎలా ఛేదించింది అనేది ఈ సిరీస్. కనకమహాలక్ష్మి తన గ్రామం నుంచి మొదటి మహిళా కానిస్టేబుల్‌ ఎంపికవుతుంది. ఎక్కడో మారుమూల ఉన్న రేపల్లె అనే గ్రామంలో ఉన్న ఒక చిన్న పోలీస్ స్టేషన్‌లో చేరుతుంది. అక్కడ యువతులు మాయమవుతున్న సంఘటనలు జరుగుతుంటాయి. సమీపంలోని అడవి గుట్టకు వెళ్లడం నిషేధించబడింది. ఈ సమయంలో కనకం, హెడ్ కానిస్టేబుల్ సాంబశివ రావు ఇంట్లో ఉంటూ, సీనియర్ కానిస్టేబుల్ సత్తిబాబు నుండి శత్రుత్వాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్రామంలో ఒకపక్క జాతర జరుగుతుంటే, కనకం స్నేహితురాలు చంద్రిక కనిపించకుండా పోతుంది. అదే సమయంలో ఓ వ్యక్తి హత్యకు గురవుతాడు. ఈ సంఘటనలు కనకానికి ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉంటుంది. అక్కడ జరుగుతుంది ఏంటో తెలుసుకోవాలనుకుంటుంది. ఆ రహస్యాన్ని ఛేదించే క్రమంలో ఆమె సహోద్యోగుల నుండి వ్యతిరేకతను ఎదుర్కుంటుంది. అయినా సరే ఆగకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది.

మొదటిగా కనకం దర్యాప్తు అడవి గుట్ట నుంచి మొదలవుతుంది. అక్కడ బ్లాక్ మ్యాజిక్, గ్రామంలోని పెద్దలు దాచిన సీక్రెట్స్ బయటపడతాయి. పంచాయతీ అధ్యక్షుడు ప్రకాష్ రావు, సబ్-ఇన్‌స్పెక్టర్ సదాశివం కథలో కీలక పాత్రలు పోషిస్తారు. వాళ్ళ పర్సనల్ సీక్రెట్స్ ఈ కేసును మరింత సంక్లిష్టం చేస్తాయి. చంద్రిక తండ్రి, గ్రామస్తుల మధ్య ఉన్న భయం, మూఢనమ్మకాలు కనకం దర్యాప్తును అడ్డుకుంటాయి. కనకం తన గతంలోని ఒక బాధాకరమైన సంఘటనను ఎదుర్కొంటూ, బ్లాక్ మ్యాజిక్ వెనుక ఉన్న విలన్‌ను కనిపెడుతుంది. క్లైమాక్స్‌లో ఒక షాకింగ్ ట్విస్ట్ తో గ్రామంలోని అతిపెద్ద రహస్యం బయటపెడుతుంది. ఈ క్లైమాక్స్‌ ట్విస్ట్ ఏమిటి ? అమ్మాయిలు ఎందుకు మిస్ అవుతున్నారు? కనకం దర్యాప్తు ఎలా సాగుతుంది? అనే విషయాలకోసం ఈ సిరీస్ చూడాల్సిందే.

Read also- Shwetha Menon: ‘అమ్మ’ ప్రెసిడెంట్‌గా శ్వేతా మేనన్‌ విక్టరీ.. ప్రత్యర్థి ఎవరో తెలుసా?

ఏ ఓటీటీలో ఉందంటే..?
ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలో నడిచే ఒక తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’. ప్రశాంత్ కుమార్ దిమ్మల ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. వర్ష బొల్లమ్మ, రాజీవ్ కనకాల, మేఘ లేఖ, శ్రీనివాస్ అవసరాల తదితరులు నటించారు. ఆరు ఎపిసోడ్‌లు ఉన్న ఈ సిరీస్, ఈ టీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.IMDbలో 7.5/10 రేటింగ్ తో ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం