Shwetha Menon: టాలీవుడ్‌కు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎలానో.. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్’ (AMMA) కూడా అలానే. ‘మా’ ఎన్నికలు అంటే ఎంత హడావుడి, హంగామా ఉంటుందో.. అంతకు మించి ఈసారి ‘అమ్మ’ ఎన్నికల్లో సందడి కనిపించింది. లాస్ట్ టైమ్ మంచు విష్ణు ‘మా’ ఎన్నికలలో గెలిచి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన పదవీ కాలం పూర్తయినా కూడా, మళ్లీ ఎన్నికలు జరగలేదు. ఇప్పుడసలు ఆ ఎన్నికలను పట్టించుకునే వారే లేరు. కారణం, మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌ల మధ్య జరిగిన ‘మా’ ఎన్నికల గురించి ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ నడిచింది. ఎన్నో పాలిటిక్స్ కూడా నడిచాయి. గొడవలు జరిగాయి. కొట్టుకోవడం, నెట్టుకోవడం వంటి పరిణామాలు కూడా సంభవించాయి. ఫైనల్‌గా మంచు మోహన్ బాబు పెత్తనంలో ‘మా’ ఎన్నికలు ఎలా జరగాలో.. అలా జరిగాయి. ఆ తర్వాత అంతా ప్రశాంతంగానే జరుగుతుంది. కానీ, అప్పటి వరకు ‘మా’ అంటే ఉన్నక్రెడిబిలిటీ మొత్తం పోయిందని మాత్రం చెప్పుకోవచ్చు. అందుకే, మంచు విష్ణు పదవీకాలం పూర్తయినా కూడా ఎవరూ.. మళ్లీ ఎన్నికలు అని అనడం లేదు. ఇక మంచు విష్ణు చేసిన వాగ్ధానాల గురించి మళ్లీ మళ్లీ చెప్పుకోవడం కూడా బాగోదు.
Also Read- Balakrishna: బస్సు నడిపిన బాలయ్య.. నీ టాలెంటే వేరయ్యా!
ఆ విషయం పక్కన పెడితే.. ‘అమ్మ’లో కూడా గత కొంతకాలంగా విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. 31 ఏళ్ల క్రితం అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) ప్రారంభమైంది. ఎం.జి. సోమన్, మధు, మోహన్‌లాల్ (Mohan Lal) వంటి ప్రముఖులు ఎందరో ఈ అసోసియేషన్‌కు అధ్యక్షులుగా పని చేశారు. అయితే ఎప్పుడూ కూడా ‘అమ్మ’ అంతగా వార్తలలో నిలవలేదు. ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా, కామ్‌గా పని జరిగిపోతుంది. కానీ, లాస్ట్ ఇయర్ పలువురు నటులు, దర్శకులపై.. అక్కడి నటీమణులు చేసిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో నైతిక బాధ్యతగా ‘అమ్మ’ అధ్యక్షుడుగా ఉన్న స్టార్ యాక్టర్ మోహన్ లాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయం అందరికీ తెలిసిందే.
ఆయన రాజీనామాతో 2027లో జరగాల్సిన ‘మా’ ఎన్నికలు.. అప్పటికప్పుడే ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో ఫస్ట్ టైమ్ ఓ లేడీ విజేతగా నిలిచి రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఆ లేడీ ఎవరో కాదు.. శ్వేతా మీనన్ (Shwetha Menon). వాస్తవానికి ఇటీవల కొన్ని రోజుల క్రితం శ్వేతా మేనన్‌పై ఓ కేసు నమోదైంది. అయినా కూడా ఆమె ధైర్యంగా ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి ముందుకు రావడంతో.. ఈ ఎన్నికల్లో మరింగా ఆసక్తి నెలకొంది. ఫైనల్‌గా తన ప్రత్యర్థి దేవన్‌పై శ్వేతా మేనన్ భారీ విజయాన్ని సొంతం చేసుకుని, ఇప్పటి వరకు లేని ఒక మహిళ అమ్మ ప్రెసిడెంట్ అనే రికార్డ్‌ను ఆమె క్రియేట్ చేశారు. 506 మంది సభ్యులకు ఓటు హక్కు ఉన్న ‘అమ్మ’లో.. కేవలం 298 మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా తెలుస్తోంది.
Also Read- Rajinikanth – PM Modi: రజనీకాంత్‌పై మోడీ ట్వీట్.. ‘కూలీ’కి మాములు బూస్ట్ కాదిది!
ఈ ఎన్నికలు హేమా కమిటీ నివేదిక, పరిశ్రమలో లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై తీవ్ర చర్చల నేపథ్యంలో జరిగాయి. మోహన్‌లాల్ రాజీనామా తర్వాత కొత్త నాయకత్వం కోసం ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఎన్నికలు మలయాళ చిత్ర పరిశ్రమలో ఒక కీలక పరిణామంగా పరిగణించబడుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థిగా పోటీ చేసిన దేవన్ విషయానికి వస్తే.. ఆయన ప్రధానంగా మలయాళ సినిమాల్లో సహాయ నటుడిగా, కొన్నిసార్లు ప్రధాన పాత్రల్లో నటించారు. విలన్ పాత్రలకు కూడా ఆయన ప్రసిద్ధి. శ్వేతా మేనన్ అధ్యక్షురాలిగా గెలిచిన ఈ ఎన్నికల్లో.. లక్ష్మీ ప్రియ ఉపాధ్యక్షురాలిగా, కుక్కు పరమేశ్వరన్ జాయింట్ సెక్రటరీగా, అన్సిబా హాసన్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు