Mahesh Kumar Goud: గతంలో స్వాతంత్య్రం వద్దని వారించిన పార్టీ బీజేపీ అని టీపీసీసీ చీఫ్మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్యాగాలు, జైళ్లు, ప్రాణత్యాగాలు ఇలా ఎందరో మహానుభావులు స్వాతంత్య్ర పోరాటం చేశారన్నారు. దేశంలో కాంగ్రెస్, (Congress) గాంధీ కుటుంబం లేకపోతే స్వాతంత్య్రమే లేదన్నారు. గాంధీజీ నేతృత్వంలో నెహ్రూ 9 ఏళ్లు జైలు జీవితం గడిపారని, వారి త్యాగాలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు.
Also Read: CM Revanth Reddy: భారీ వర్షాలపై సీఎం అత్యవసర సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ
45 ఓట్లు ఎలా ఉంటాయి?
బ్రిటిష్ పాలకుల అడుగులకు మడుగులు వత్తిన వారు బీజేపీ(BJP) నాయకులు అంటూ మహేశ్ మండిపడ్డారు. దేశంలో పెద్దల కోసం పేదల నడ్డి విరుస్తున్నారన్నారు. డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నా, కేంద్రం స్పందించడం లేదని మండిపడ్డారు. పెత్తందారుల కోసమే పాలన చేస్తున్నారని, గాడ్సే వారసులు చేయకూడని విధంగా ప్రస్తుతం చేస్తున్నారన్నారని ఆరోపించారు. విపరీతంగా ఓట్ల దొంగతనం జరిగిందని రాహుల్ గాంధీ(Rahul Gandhi) నిరూపించారన్నారు. బీజేపీ(BJP)కి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించారన్నారు. ఒక్క సింగల్ బెడ్ రూమ్‌లో 45 ఓట్లు ఎలా ఉంటాయి? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) పోరాటం గొప్ప విషయమని మహేశ్ గౌడ్(Mahesh Kumar Goud) ప్రశంసించారు.
Also Read: Shwetha Menon: ‘అమ్మ’ ప్రెసిడెంట్‌గా శ్వేతా మేనన్ విక్టరీ.. ప్రత్యర్థి ఎవరో తెలుసా?