Ponguleti Srinivas Reddy( image CREDIT: Swetcha reportr)
తెలంగాణ

Ponguleti Srinivas Reddy: తెలంగాణ సమాజానికి మహిళలే పునాది.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

Ponguleti Srinivas Reddy:  కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేయాలన్న ఉక్కు సంకల్పం ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) అన్నారు. వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ కుష్మహల్ వద్ద నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలల్లో ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ పదేళ్లలో విధ్వంసమైన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తున్నామన్నారు.

 Also Read: MP Raghunandan Rao: 71 వేల ఫేక్ ఓట్లు.. బీహార్ ఓటమిని ముందే ఒప్పుకున్నారు.. మెదక్ ఎంపీ రఘునందన్ రావు

‘తెలంగాణ రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి, లక్ష్యాల సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు తెలంగాణ రైజింగ్-2047 విజన్‌తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 2035 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా వృద్ది సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం సాధించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నాం. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేయాలన్న ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది’ అని పొంగులేటి తెలిపారు.

మాస్టర్ ప్లాన్..
‘గత పదేళ్ల కాలంలో మహిళలకు వడ్డీలేని రుణాల పథకం పూర్తిగా నిర్వీర్యమైంది. మా ప్రభుత్వం 20 నెలల కాలంలో 67 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రెండు విడతలుగా రూ.900 కోట్లు వడ్డీల రూపంలో చెల్లించింది. మొదటి సంవత్సరంలో రూ.21,500 కోట్ల వడ్డీ లేని ఋణాలు పంపిణీ చేశాం. రూ.500కే వంటగ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. వరంగల్ నగరాన్ని రాజధాని హైదరాబాద్‌(Hyderabad)కు ధీటుగా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

వరంగల్(Warangal) నగర అవసరాలకు సరిపోయేలా మాస్టర్ ప్లాన్‌ను తీసుకువచ్చాం. 2057 జనాభాను దృష్టిలో పెట్టుకొని రూ.4,100 కోట్లతో వరంగల్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను త్వరలో ప్రారంభించుకోబోతున్నాం. వరంగల్(Warangal) ప్రజల ప్రాంత చిరకాల స్వప్నమైన మామునూరు ఎయిర్‌పోర్టు కల త్వరలో సాకారం కాబోతోంది. విమానాశ్రయ భూసేకరణకు ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేసింది’ అని పొంగులేటి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కూడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ సత్య శారద, అన్ని శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Also Read: Allu Aravind: ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది