Khammam: కారేపల్లి రైల్వే జంక్షన్ మీదుగా గతంలో నడిచి రద్దు చేయబడిన రైళ్లను పునరుద్ధరించేందుకు రైల్వే అధికారులతో చర్చిస్తానని ఖమ్మం(Khammam) పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి(Ramasahayam Raghuram Reddy) అన్నారు. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తో కలిసి ఎంపి రఘురాంరెడ్డి కారేపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో రద్దు చేసిన రైళ్లలో కొన్ని రైళ్లను నేటికీ పునరుద్ధరించలేదని సామాజిక కార్యకర్త ఇందుర్తి సురేందర్ రెడ్డి ఎంపీ కి వినతి పత్రం ఇచ్చారు. కరోనా(Civid) కంటే ముందు డోర్నకల్(Dornakal) జంక్షన్ నుండి భద్రాచలం రోడ్డు వరకు కారేపల్లి జంక్షన్ మీదుగా రోజు ఎనిమిది రైళ్లు నడిచేవని, కరోనా సమయంలో ఈ రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ కరోనా తర్వాత కొన్ని రైళ్లను మాత్రమే పునరుద్ధరించి మిగతా రైళ్లను నేటికీ పునరుద్ధరించలేదని సురేందర్ రెడ్డి ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు.
అలాగే ఈ రైల్వే లైన్ లో నడిచే ప్రతి రైలు కూడా అన్ని స్టేషన్లలో ఆగేవని, కానీ ప్రస్తుతం నడిచే రైళ్ళు కారేపల్లి తప్ప మిగతా స్టేషన్లలో ఆగడం లేదని తద్వారా ఈ ప్రాంత గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎం(MP)పి కి వివరించారు. ఈ సమస్యలన్నింటిని రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లి రైళ్ల పునరుద్ధరణ, ఈ రైళ్లన్నింటిని డోర్నకల్ జంక్షన్ నుండి భద్రాచలం రోడ్డు మధ్యలోని అన్ని స్టేషన్లలో హాల్టింగ్ ఇచ్చే విధంగా కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. అనంతరం రైల్వే స్టేషన్ ను సందర్శించారు.
Also Read: Hanamkonda News: ఉత్తర తెలంగాణలో గొల్ల కురుమల సాంస్కృతిక సమ్మేళనం!
అమర జవాన్ కుటుంబానికి పరామర్శ
కారేపల్లి మండలంలోని సూర్య తండా అమర జవాన్ అనిల్ కుమార్(Anil Kumar) కుటుంబాన్ని ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డి, ఎమ్మెల్యే రాందాస్ నాయక్9MLA Ramdas Nayak) పరామర్శించారు. విధులు నిర్వర్తిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్ అనిల్ కుమార్ కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. కారేపల్లి లో గుండెపోటుతో మరణించిన తెలంగాణ ఉద్యమకారుడు జడల వెంకటేశ్వర్లు భౌతిక కాయాన్ని సందర్శించి పూల మాల వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తలారి చంద్రప్రకాష్, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, ఇమ్మడి తిరుపతిరావు, పగడాల మంజుల,సురేందర్ మనియార్, అడ్డగోడ ఐలయ్య, బానోతు రామ్మూర్తి నాయక్, మల్లెల నాగేశ్వరరావు, గుగులోతు శీను, భీముడు నాయక్, హీరా లాల్, మేదరి వీర ప్రతాప్, వినోద్ నాయక్, మేదరి రాజా, ఈశ్వరిబాయి, మత్రు నాయక్, డేగల ఉపేందర్ పాల్గొన్నారు.
Also Read: Actress: పెళ్ళై పిల్లలున్న డైరెక్టర్ పై మోజు పడుతున్న కుర్ర హీరోయిన్?