Sir Madam Movie
ఎంటర్‌టైన్మెంట్

Sir Madam OTT: ఓటీటీలోకి విజయ్ సేతుపతి, నిత్యామీనన్‌ల ‘సార్ మేడమ్’.. స్ట్రీమింగ్ డిటైల్స్ ఇవే..

Sir Madam OTT: వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మేనన్‌ (Nithya Menen) జంటగా నటించిన రోమ్ కామ్ ఫ్యామిలీ డ్రామా చిత్రం ‘సార్‌ మేడమ్‌’ (Sir Madam). ‘ఏ రగ్గ‌డ్ లవ్ స్టోరీ’ అనే ట్యాగ్ లైన్‌‌తో వచ్చిన ఈ చిత్రానికి పాండిరాజ్‌ దర్శకుడు. సత్యజ్యోతి ఫిలిమ్స్‌ బ్యానర్ పై సెందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. తమిళ్‌లో ముందుగా విడుదలై మంచి విజయాన్నిఅందుకున్న ఈ సినిమా.. ఆగస్ట్ 1న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను బాగానే ఆదరించారు. కాకపోతే, ప్రమోషన్స్ అంతగా లేకపోవడంతో.. ఈ సినిమా ఎప్పుడు విడుదల అయ్యిందో చాలా మందికి తెలియలేదు. మరో వైపు ముందు చెప్పిన విడుదల తేదీన కాకుండా.. మరో తేదీకి ఈ సినిమా విడుదలవడం కూడా.. ఈ సినిమా అంతగా ప్రేక్షకులకు రీచ్ కాకపోవడానికి కారణంగా తెలుస్తోంది. ఇక ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. థియేటర్లలో రీచ్ అవడంలో ఇబ్బందులు పడిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో మాత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

Also Read- Mutton Soup: ‘మటన్ సూప్’ టైటిల్ పోస్టర్‌ విడుదల.. అయ్యబాబోయ్, నిజంగానే సూప్‌లా ఉందిగా!

‘సార్ మేడమ్’ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలకు వస్తే.. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా ఆగస్ట్ 22 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా.. నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. అంటే తెలుగులో విడుదలైన 20 రోజులకే ఈ సినిమా ఓటీటీలోకి రానుందన్నమాట. ‘ఉప్పెన’ సినిమాతో తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకున్న విజయ్ సేతుపతి, అలాగే తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న నిత్యా మీనన్ కలిసి చేసిన ఈ సినిమా కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని, అందునా భార్యభర్తలు కంపల్సరీగా ఈ సినిమా చూడాలనేలా టాక్ నడిచిన విషయం తెలిసిందే. మరి ఈ టాక్‌ని ఓటీటీ వీక్షకులు ఎంత వరకు పట్టించుకుంటారో, ‘సార్ మేడమ్’ని ఎలా ఆదరిస్తారో?.. తెలియాలంటే మాత్రం ఆగస్ట్ 22 వరకు వెయిట్ చేయక తప్పదు.

Also Read- ChatGPT Advice: చాట్‌జీపీటీ చెప్పింది గుడ్డిగా నమ్మిన దంపతులు.. చివరకు ఊహించని ట్విస్ట్

‘సార్ మేడమ్’ మూవీ కథ ఇదే..
ఆకాశ వీరయ్య (విజయ్‌ సేతుపతి) పరోటా మాస్టర్‌. అలాంటిలాంటి మాస్టర్ కాదు. ఆ వంటలో ఆయనకు మంచి పేరుంటుంది. సొంత ఊళ్లోనే హోటల్‌ నడుపుతూ జీవనం సాగిస్తున్న వీరయ్యకు, పక్క ఊళ్లో ఉన్న రాణి (నిత్యా మేనన్‌)కి పెళ్లి సంబంధం కుదురుతుంది. రాణిని చూడడానికి వెళ్లినప్పుడే ఆమెపై మనసు పడతాడు వీరయ్య. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని.. సంబంధం ఓకే అవుతుంది. ఇద్దరూ ఇష్టపడ్డారు కదా.. ఇక ప్రాబ్లమ్ ఏముంది పెళ్లికి? అని అనుకోవద్దు. అక్కడి నుంచే మొదలవుతుంది అసలు కథ. ఇద్దరి కుటుంబ నేపథ్యాల గురించి తెలిసిన తర్వాత పెళ్లి వద్దని అనుకుంటారు. కానీ, అప్పటికే వీరయ్య, రాణి ప్రేమలో మునిగిపోయి ఉంటారు. ఇరు కుటుంబాలు ఎంతగా మొత్తుకున్నా వినరు. అంతేకాదు, పారిపోయి పెళ్లి చేసుకుంటారు. పెళ్లైన కొత్తలో నీకు నేను, నాకు నువ్వు అన్నట్టుగా సాగిన వారి వైవాహిక జీవితంలో కొన్నాళ్లకే గొడవలు మొదలవుతాయి. సిల్లీ విషయాలకు కూడా ఇద్దరూ గొడవలు పడుతుంటారు. అసలు వారిద్దరి మధ్య గొడవలకు కారణం ఏమిటి? ఆ గొడవలు విడాకుల వరకు ఎందుకు వెళ్లాయి? విడాకులు తీసుకున్నారా? లేదంటే వారి మధ్య మళ్లీ సత్సంబంధాలు నెలకొన్నాయా? తెలియాలంటే.. ఈ సినిమా చూడాల్సిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?