Mutton Soup: ‘మటన్ సూప్’ పేరుతో టాలీవుడ్‌లో ఇప్పుడో సినిమా రూపుదిద్దుకుంటోంది. రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు బ్యానర్లపై.. రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి (Rama Chandra Vattikuti) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘విట్‌నెస్ ది రియల్ క్రైమ్’ అనేది ట్యాగ్ లైన్. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మిస్తోన్న ఈ చిత్ర టైటిల్, మోషన్ పోస్టర్స్‌ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 15న నిర్మాత కె.ఎస్. రామారావు చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే.. అయ్యబాబోయ్, నిజంగానే సూప్‌లా ఉందిగా అనే ఫీల్‌ని మేకర్స్ కల్పించారు. ఒక్క ఫేస్‌లో మూడు ఫేస్‌లను మిళితం చేసిన తీరు ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. సినిమాపై క్రేజ్ ఏర్పడేలా చేస్తోంది.
టైటిల్, మోషన్ పోస్టర్స్ విడుదల అనంతరం నిర్మాత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ.. పర్వతనేని రాంబాబు సారథ్యంలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు బ్యానర్లపై రామచంద్ర వట్టికూటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ ‘మటన్ సూప్’ (Mutton Soup) చిత్ర టైటిల్ పోస్టర్ చాలా బాగుంది. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు. హీరో రమణ్ మాట్లాడుతూ.. నా స్నేహితుడు రామచంద్ర మంచి కథతో ‘మటన్ సూప్’ను సిద్ధం చేస్తున్నారు. టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్ అద్భుతంగా వచ్చాయి. మా కోసం వచ్చి సపోర్ట్ చేసిన నిర్మాత కె.ఎస్.రామారావుకు థ్యాంక్స్. సినిమా అద్భుతంగా వస్తోంది. అహర్నిశలు ఈ సినిమా కోసం మా టీమ్ అంతా ఎంతో కష్టపడుతోంది. ప్రేక్షకులతో ఓ మంచి చిత్రమనే పేరును ఈ సినిమా సొంతం చేసుకుంటుందని తెలిపారు.
Also Read- Venkatesh – Trivikram: మరీ ఇంత సైలెంట్‌గానా!.. ‘వెంకీ-త్రివిక్రమ్’ ప్రాజెక్ట్ ప్రారంభం
చిత్ర నిర్మాతలు మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణలు మాట్లాడుతూ.. మా సినిమా టైటిల్ పోస్టర్ విడుదల కార్యక్రమానికి వచ్చిన వారందరికీ థ్యాంక్స్. త్వరలోనే మేం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. మంచి చిత్రంతో రాబోతోన్న మా అందరినీ ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ ‘మటన్ సూప్’ సినిమాను రూపొందిస్తున్నాం. మా సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేసిన నిర్మాత కె.ఎస్. రామారావుకు థ్యాంక్స్. త్వరలోనే మరిన్ని వివరాలు తెలుపుతామని చెప్పగా.. ‘మా నిర్మాతలు, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు సారథ్యంలో నేను తెరకెక్కిస్తున్న చిత్రం ‘మటన సూప్’. ఒక బర్నింగ్ టాపిక్‌పై యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు కనెక్ట్ అవుతున్నారు. త్వరలోనే మరో అప్డేట్‌తో వస్తామని చిత్ర దర్శకుడు తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు