UP Horror: భార్య చేతిలో చివాట్లు.. కోపంతో బిడ్డను చంపేసిన భర్త!
UP Crime: Image Source: Freepic)
Viral News

UP Horror: భార్య చేతిలో చివాట్లు.. కోపంతో బిడ్డను చంపేసిన భర్త.. ఎక్కడంటే?

UP Horror: దాంపత్య జీవితంలో సహజంగానే చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. భార్యపై భర్త కోపడటం, భర్తపై భార్య చికాకు పడటం వంటివి ప్రతీ కాపురంలో సాధారణంగా ఉండేదే. ఈ క్రమంలోనే ఓ భర్త తన భార్యతో గొడవపడ్డాడు. అయితే ఈ తగువును అతడు మరింత సీరియస్ గా తీసుకున్నాడు. గొడవలో భాగంగా భార్య తనను తిట్టడాన్ని అసలు తట్టుకోలేకపోయాడు. ఆ కోపాన్ని రెండేళ్ల బిడ్డపై చూపించి ప్రాణాలు బలిగొన్నాడు.

వివరాల్లోకి వెళ్తే..
యూపీలోని మైన్ పురి జిల్లా చిటావా గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 30 ఏళ్ల రాజ్ బహదూర్ (Raj Bahadur), భార్య యమునావతి (Yamunawati)తో కలిసి జీవిస్తున్నాడు. వారికి లలిత్ (Lalith) అనే రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఇటీవల రాఖీ పండుగను పురస్కరించుకొని భార్య యమునావతి పుట్టింటికి వెళ్లింది. అనంతరం ఆమెను రాజ్ స్వయంగా వెళ్లి ఇంటికి కూడా తీసుకొచ్చాడు.

Also Read: Thai Princess: రెండేళ్లుగా బెడ్ పైనే ప్రిన్సెస్.. రాజ భవనం నుంచి షాకింగ్ ప్రకటన

టెర్రస్‌పై ఉండగా గొడవ
భార్య యుమునావతి తన బిడ్డ లలిత్ తో కలిసి ఇంటి టెర్రస్ పై ఉండగా భర్త రాజ్ బహదూర్ వారి వద్దకు వెళ్లాడు. ఇద్దరు మాట్లాడుకుంటున్న క్రమంలో ఓ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రాజ్ కు యమునావతి చివాట్లు పెట్టింది. దీంతో కోపావేశంతో ఊగిపోయిన రాజ్.. చేతిలో ఉన్న బిడ్డను ఒక్కసారిగా ఎత్తి కిందకి విసిరేశాడు. రెండంతస్తుల పై నుంచి కింద పడటంతో బాలుడు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.

Also Read: Atal Canteen: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. ఇక రూ.5కే ఆహారం.. రూ.100 కోట్లు కేటాయింపు!

పోలీసులు ఏమన్నారంటే?
ఘటనకు సంబంధించి భోగావన్ డీఎస్పీ రిషి కాంత్ శుక్లా మీడియాతో మాట్లాడారు. ‘సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు బాలుడిని పై అంతస్తు నుంచి విసిరేశారని ఆరోపిస్తుండగా ప్రాథమిక వైద్య పరీక్షల్లో ఎటువంటి బాహ్య గాయాలు కనబడలేదని తేలింది’ అని చెప్పారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు వారు చెప్పారు.

Also Read This: CM Revanth Reddy: ఏపీతో జల వివాదం.. గోల్కొండ వేదికగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!

Just In

01

Kavitha: లేబర్ చట్టాలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం : కవిత

Panchayat Elections: ప్రశాంతంగా ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు.. మూడు విడత ఎన్నికల్లో 85.77 శాతం పోలింగ్​ నమోదు!

Seethakka: గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలి : మంత్రి సీతక్క

David Reddy: ‘డేవిడ్ రెడ్డి’ గ్లింప్స్ చూశారా?.. మంచు మనోజ్ చెప్పేది వింటే ఏమైపోతారో?

Jinn Movie: ‘జిన్’ అలా ఇలా భయపెట్టడు.. థియేటర్లలో ఒక్కొక్కరికి! నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు