Asia Cup 2025
Viral, లేటెస్ట్ న్యూస్

Asia Cup 2025: ఆసియా కప్‌కు టీమిండియా ఎంపికపై అప్‌డేట్.. కెప్టెన్‌ ఎవరంటే?

Asia Cup 2025: యూఏఈ వేదికగా వచ్చే నెలలో జరగనున్న ఆసియా కప్-2025లో (Asia Cup 2025) చోటు దక్కించుకోనున్న టీమిండియా క్రికెటర్లు ఎవరనేది ఉత్కంఠగా మారింది. ఈ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరగనుండడంతో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు కీలక అప్‌డేట్ ఇచ్చాయి. ఆసియా కప్‌ కోసం భారత జట్టుని ఆగస్ట్ 19న ముంబైలో ఎంపిక చేయనున్నట్టు ఓ అధికారి వెల్లడించారు. జట్టు ఎంపిక పూర్తయిన తర్వాత బీసీసీఐ చీఫ్ సెలెక్టర్, మాజీ పేసర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని సదరు అధికారి పేర్కొన్నారు. టీమిండియా టీ20 ఫార్మాట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉండగా, జట్టు ఎంపిక దృష్టా ముంబై వెళ్లనున్నారంటూ ఓ అధికారి చెప్పినట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా ’ కథనాన్ని ప్రచురించింది. స్పోర్ట్స్ హెర్నియా శస్త్రచికిత్స తర్వాత సూర్యకుమార్ యాదవ్ బెంగళూరులో బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఇప్పటికే నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. దీనిని బట్టి ఆసియా కప్‌కు కెప్టెన్‌గా వ్యవహరించేది సూర్యకుమార్ యాదవ్ అని స్పష్టమవుతోందని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం పేర్కొంది.

గిల్‌కు వైస్ కెప్టెన్సీ కష్టమే
టెస్ట్ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్‌ను ఆసియా కప్ ఆడబోయే టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా నియమించవచ్చంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. వైస్ కెప్టెన్సీ విషయాన్ని పక్కనపెడితే అసలు జట్టులో చోటు దక్కడమే కష్టమని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. శ్రేయాస్ అయ్యర్, యశస్వి జైస్వాల్‌ జట్టులోకి ఎంపికవ్వడం కూడా కష్టమనే తెలుస్తోంది. యశస్వి జైస్వాల్‌ను టెస్ట్ క్రికెట్‌పై దృష్టి పెట్టాలంటూ బీసీసీఐ సెలక్టర్లు సూచించినట్టుగా సమాచారం. నిజానికి, సంజూ శాంసన్, అభిషేక్ శర్ ఓపెనర్లుగా రాణిస్తున్నారు. దీంతో, గిల్‌కు జట్టులో చోటు దక్కడం కష్టమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌‌లో టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన యశస్వి జైస్వాల్‌తో పాటు, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్‌కు కూడా ఆసియా కప్‌కు ఎంపిక చేయకపోవచ్చని తెలుస్తోంది.

Read Also- Independence day celebrations: జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మలతో పాటు కెప్టెన్ సూర్యకుమార్ కూడా ఉండడంతో టాప్ ఆర్డర్ చాలా బలంగా కనిపిస్తోంది. కొత్త ఆటగాళ్లకు టాపార్డర్‌లో చోటు దక్కే అవకాశం కనిపించడం లేదు. ఈ కారణంగానే గిల్‌కు చోటు దక్కడం కష్టంగా మారిపోయింది. ఇక, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఇరువురూ తమ చివరి టీ20 మ్యాచ్‌ను జులై 2024లో ఆడారు. ఆ తర్వాత టీమిండియా టెస్ట్ ఫార్మాట్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

Read Also- Tollywood Actor: బరితెగించిన హీరో.. డైరెక్టర్ చెప్పాడని.. రోడ్డుపై ప్యాంట్ తీసేసి..!

మరోవైపు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు టీ20 ఫార్మాట్‌లో ఫర్వాలేదనిపిస్తున్నాడు. టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు 36.90 సగటుతో మొత్తం 1,107 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేట్ 161.13గా ఉంది. మొత్తం 8 అర్ధ శతకాలు సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో అతడి బెస్ట్ స్కోర్ 75 పరుగులుగా ఉంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అంత చక్కటి ఫామ్‌ను కనబరిచిన దాఖలాలు లేవు. ఇక, టీమిండియా టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇప్పటివరకు 22 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడి 893 పరుగులు సాధించాడు. అతడి సగటు 47 పరుగులుగా, స్ట్రైక్ రేట్ 147గా ఉంది. అత్యుత్తమ స్కోర్ 93 (నాటౌట్) పరుగులుగా ఉంది.

Just In

01

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?