BRAOU UG PG Admissions 2025: అడ్మిషన్లకు చివరి తేదీ పొడిగింపు
BRAOU UG PG Admissions 2025( image CREDIT: TWITTER)
Telangana News, లేటెస్ట్ న్యూస్

BRAOU UG PG Admissions 2025: బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూజీ పీజీ అడ్మిషన్లకు చివరి తేదీ పొడిగింపు

BRAOU UG PG Admissions 2025: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ సార్వత్రిక విశ్వవిద్యాలయం(Dr BR Ambedkar Open University) డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ), పీజీ (ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంబీఏ), బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశ గడువును పొడిగించినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఆగస్టు 30వ తేదీ వరకు ఫీజు చెల్లించి ప్రవేశం పొందవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా, 2023-24, 2024-25 విద్యా సంవత్సరాల్లో డిగ్రీలో చేరిన ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు, అంతకు ముందు చేరిన డిగ్రీ, పీజీ విద్యార్థులు(PG students) సకాలంలో ట్యూషన్ ఫీజు చెల్లించలేకపోతే, ఈ నెల 30వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో చెల్లించాలని సూచించారు.

 Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ

హెల్ప్‌డెస్క్ నంబర్లు

2016 నుంచి 2024 మధ్య కాలంలో ఈ కోర్సుల్లో చేరి ఫీజు చెల్లించలేని వారు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. పూర్తి సమాచారం, ఆన్‌లైన్ నమోదుకు సంబంధించిన సందేహాల కోసం సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని లేదా విశ్వవిద్యాలయ హెల్ప్‌డెస్క్ నంబర్లు 040-23680222, 333, 444, 555కు సంప్రదించాలని సూచించారు. టోల్‌ఫ్రీ నంబర్ 18005990101కు కూడా కాల్ చేయవచ్చు. మరింత సమాచారం కోసం www.braouonline.in లేదా www.braou.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

 Also Read: Khammam Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు.. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..