Hanamkonda News (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Hanamkonda News: ఉత్తర తెలంగాణలో గొల్ల కురుమల సాంస్కృతిక సమ్మేళనం!

Hanamkonda News: ఉద్యమాల పురిటి గడ్డ ఓరుగల్లులో ‘యాదవ వెల్ఫేర్ ట్రస్ట్-వరంగల్’ వేదికగా కుడా మాజీ చైర్మన్ ఎస్.సుందర్ రాజ్ ఆధ్వర్యంలో ఈ 16న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు గొల్లకురుమలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ వేదికగా గొల్లకురుమల ఐక్యతను చాటేందుకు ‘గొల్లకురుమ సాంస్క్రుతిక సమ్మేళనం’ నిర్వహణకు కసరత్తు పూర్తయింది. తెలంగాణ రాష్ట్రంలోనే వరంగల్ ((Waranagal)) నగరంలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న భారీ వేడుకలకు హర్యానా మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ(Dattatreya) ముఖ్యాతిథిగా, రాష్ర మంత్రి కొండా సురేఖ(Min Konda Sureka), స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(Mla naine Rajenfer Reddy) విశిష్ట అతిథులుగా హాజరవనున్నట్టు కుడా మాజీ చైర్మన్, యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ ఎస్. సుందర్ రాజ్ యాదవ్ ప్రకటించారు. ఐదువేల మంది వందే జగద్గురు భక్తులు హాజరయ్యే ఈ క్రుష్ణ తత్వంలో మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, మండలి ప్రతిపక్ష నేత మధుసూధనాచారి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నాగరాజు, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్ లు భక్తి పారవశ్యులవనున్నట్టు సుందర్ రాజ్ యాదవ్ తెలిపారు.

రాజకీయాలకు అతీతంగా

సినీరంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్న గొల్లకురుమ వర్ధమాన సినీ సంగీత దర్శకులు, రచయితలు, కవులు, గాయకులు, జానపద కళాకారులు వేడుకల్లో గొల్లకురుమ సంస్క్రుతి సంప్రదాయాలను కళ్లకు కట్టనున్నారని ప్రకటించారు. హనుమకొండ రాంగనగర్ లోని బీసీ భవన్ నుంచి కాళోజీ కళాక్షేత్రం వరకు సాగే శ్రీక్రుష్ణుడి శోభాయాత్రలో వేలాది మంది గొల్లకురుమలు, భగవత్ బంధవులు శోభాయాత్ర నిర్వహించనున్నట్టు, రెండు వేల మంది యువత, జానపద కళాకారుల ఆట పాటతో శ్రీక్రుష్ణుడి శోభాయాత్ర కొనసాగుతుందని సుందర్ రాజ్ యాదవ్(Sundhar raj yadav) ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగాం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలకు చెందిన గొల్లకురుమలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారని దానికి తగిన విధంగా యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాట్లు పూర్తి చేసిందని సుందర్ రాజ్ యాదవ్ తెలిపారు.

రాజకీయాలకు అతీతంగా నిర్వహించే కార్యక్రమంలో కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రజలు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగస్వాములు అవుతున్నారని అన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి, గొల్లకురుమ సాంస్క్రుతిక సమ్మేళనానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను గొల్లకురుమ నేతల సమక్షంలో సుందర్ రాజ్ యాదవ్ ఆవిష్కరించారు. గొల్లకురుమల సంస్క్రుతి, సాహిత్య నేపథ్యం కలిగిన కరపత్రాలను ఈ సందర్భంగా గొల్లకురుమ ప్రతినిధులు విడుదల చేశారు.

Also Read: Jr NTR: సీఎం రేవంత్‌కు థ్యాంక్స్ చెప్పడం మరిచిపోయిన ఎన్టీఆర్.. ఏం చేశాడంటే?

రక్షణ కవచంగా నిలిచి భగవత్

ఈ సందర్భంగా సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో మూడో సారి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని, ప్రపంచమంతా వందే జగద్గురు మార్గంలో పయనిస్తోందని అన్నారు. వెస్ట్రన్ కల్చర్ డామినేట్ చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీకృష్ణుడి గీతబోధనలు ప్రజలకు ప్రభోదాలుగా మారుతున్నాయనే సత్యాన్ని, ప్రపంచమే అబ్బురపడే హైందవ సంస్క్రుతిని భావితరాలకు అందించాలనే సంకల్పంతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని అన్నారు. కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపి ధర్మ పరిరక్షణకు రక్షణ కవచంగా నిలిచి భగవత్ బంధువుడిగా నిలిచిన శ్రీక్రుష్ణుడు గొల్లకురుమల రక్త బాంధవుడని, ఆ పరమాత్ముడి డీఎన్(DNA)ఏ, మా డీఎన్ఏ ఒక్కటే నని సుందర్ రాజ్ యాదవ్ అన్నారు.

దేశంలోనే అతి విశిష్టమైన అనంత పద్మనాభ స్వామి దేవాలయ నిర్మాణ ఘనత యాదవులదయితే, కలియుగ క్షేత్రం తిరుమల తిరుపతిలో తొలి దర్శనం యాదవులదే కావడం, గొల్కొండ కేంద్రంగా రాజ్యపాలన చేయడం ఈ జాతి విశిష్టతకు అద్దం పడుతోందని అన్నారు. సమాజ గమనంలో గొల్లకురుమల ఐక్యత అత్యవసరమైందని, అన్ని వర్గాలతో మమేకమవుతూ హైందవ సంస్క్రుతిని, గొల్లకురుమల సాంస్క్రుతిక వైభవాన్ని మేళవించి భావి సమాజా నిర్మాణానికి పునాది వేయాల్సిన పరిస్థితి ఆవశ్యమైందని సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్ మాజీ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్ మాట్లాడుతూ… వరంగల్ కేంద్రం శ్రీకృష్ణుడి వైభవానికి వేదికే కాదు కాకతీయుల నుంచి మొదలు కొని ప్రతీ చరిత్రలో యాదవులకున్నది ప్రత్యేక స్థానమున్నదని అన్నారు.

గొల్లకురుమలతో సహా

శ్రీకృష్ణ తత్వం కోసం భారత దేశం వేచి చూస్తోందని, వందే జగద్గురు మార్గం కోసం సమాజం తహ తహ లాడుతోందని అందుకే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల నిర్వహణకు వరంగల్ కేంద్రంగా కావాలన్న ఆకాంక్ష మేరకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. అఖిల భారత యాదవ మహాసభ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గిరబోయిన రాజయ్య యాదవ్ మాట్లాడుతూ ఈ వేడుకలను విజయవంతం చేయడానికి భగవత్ బంధువులైన గొల్లకురుమలతో సహా అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.

కుటుంబాలతో సహా కార్యక్రమంలో హాజరవాలని అన్నారు….ఈ కార్యక్రమంలో గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్ మాజీ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గిరబోయిన రాజయ్య, యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యుడు కెంచ కుమారస్వామి, కార్పొరేటర్ బొంగు అశోక్, అఖిల భారత యాదవ మహాసభ జనగాం జిల్లా అధ్యక్షుడు సిద్ధిరాజ్ యాదవ్, యాదవ మహాసభ నేతలు బుట్టి శ్యాం యాదవ్, ఎల్లావుల కుమార్ యాదవ్, రాజేందర్ యాదవ్,మాదం రజిని కుమార్ యాదవ్, దూడయ్య యాదవ్, చెన్నమల్లు యాదవ్, సమ్మయ్య యాదవ్,TYSS రాష్ట్ర నేతలు బొంగు రాజు యాదవ్, బోయిని బిక్షపతి యాదవ్, పర్వతాలు యాదవ్,కనక రాజు యాదవ్, ప్రమోద్ యాదవ్ పాల్గొన్నారు.

Also Read: Viral Video: మహా అద్భుతం.. గంటలో హీరోగా మారిపోయిన ఆటోవాలా.. వీడియో వైరల్!

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?