Coolie Bookings (Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Coolie Bookings: నా దారి రహదారి అంటున్న రజినీకాంత్.. దెబ్బ అదుర్స్ కదూ!

Rajinikanth: బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ జరగనుంది. ఇంకా కేవలం 24 గంటలు మాత్రమే ఉంది. ఆగస్టు 14న రెండు పాన్-ఇండియా సినిమాలు రిలీజ్ కానున్నాయి. రజనీకాంత్ నటించిన కూలీ, హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న వార్ 2 రిలీజ్ కానుంది. అయితే, ఈ రెండు చిత్రాల మధ్య బాక్సాఫీస్ వద్ద పెద్ద పోటీనే నెలకొంది. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా చూస్తే “కూలీ” దుమ్ము దులుపుతుందనే చెప్పుకోవాలి. ఈ ముందస్తు రికార్డు బుకింగ్స్ తోనే విజయాన్ని నమోదు చేసిందనే చెప్పొచ్చు.

ఇండియా వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ (Coolie vs War 2 Advance Bookings) ఇవే..

Also Read: Anupama parameswaran: ఆ హీరోతో ముద్దు సీన్స్ బలవంతంగా చేయాల్సి వచ్చింది.. అనుపమ సంచలన కామెంట్స్

కూలీ (Coolie)

మొత్తం బుక్కైన టిక్కెట్లు: 9,11,730

గ్రాస్ కలెక్షన్ : ₹26.28 కోట్లు

Also Read: Vijay Sethupathi: విజయ్ సేతుపతికి ఆ కోరిక తీరిస్తేనే అమ్మాయిలకు సినిమాలో ఛాన్స్ ఇస్తాడా.. నిజాలు బయటపెట్టిన డైరెక్టర్?

వార్ 2 (War 2)

అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో మన ముందుకు వస్తున్న ‘వార్ 2’ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో ఎన్టీఆర్-హృతిక్ మధ్య యాక్షన్ సీన్స్, అద్భుతమైన విజువల్స్ అభిమానులను ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా ‘సలాం అనాలి’ పాటలో ఎన్టీఆర్, హృతిక్ డ్యాన్స్ స్టెప్స్ అదిరిపోయాయి. థియేటర్లలో ఈ పాట కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బుక్కైన టిక్కెట్లు: 1,29,750

గ్రాస్ కలెక్షన్: ₹8.67 కోట్లు

Also Read: Bhatti Vikramarka: పన్ను భారం లేకుండా గ్రీన్ పవర్ ఉత్పత్తితో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రజనీకాంత్ మరోసారి తన సత్తాని చూపించారు. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం, అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్, పవర్‌ఫుల్ స్టోరీ అన్నీ కలసి “కూలీ” సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ ని షేక్ చేయనున్నాయి. వరల్డ్ వైడ్ గా “కూలీ” సినిమా తన సత్తా చూపిస్తోంది. ఇప్పటికే గ్లోబల్ అడ్వాన్స్ బుకింగ్స్ రూ.85 కోట్లు దాటాయి. సినిమా రిలీజ్ తర్వాత రూ.100 కోట్ల మార్కును అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. ఇంకోవైపు, వార్ 2 హిందీ బెల్టులో ఆశించిన స్థాయిలో ఆదరణ రాబట్టుకోలేకపోయింది. అయితే, జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఒక్క కారణంగా తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ మరింత పెరుగుతాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ