Jangaon Strange Incident: రాష్ట్రంలో వింతగా ప్రవర్తించిన చెట్టు..!
Jangaon Strange Incident (Image Source: AI)
Telangana News

Jangaon Strange Incident: రాష్ట్రంలో అద్భుతం.. వింతగా ప్రవర్తించిన చెట్టు.. ఇది దేవుడి మహిమేనా?

Jangaon Strange Incident: సాధారణంగా ఈ సృష్టిలో మానవులకు అతీతంగా ఏ చిన్న ఘటన జరిగిన దానిని దైవంతో ముడిపెడుతూ ఉంటారు. వేప చెట్టు నుంచి పాలు కారడం, విగ్రహాల నుంచి విభూది రాలడం వంటి ఘటనలను దైవ లీలగా కొందరు అభివర్ణిస్తుంటారు. అయితే తాజాగా ఇలాంటి ఘటనే రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఓ చింత చెట్టు సాధారణం కంటే విభిన్నంగా ప్రవర్తించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

అసలేం జరిగిందంటే?
తెలంగాణ జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ముదిరాజ్ కాలనీలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. ముదిరాజు సంఘం జిల్లా అధ్యక్షుడు నీల గట్టయ్య ఇంటి ఆవరణలో ఉన్న చింత చెట్టు మొక్క అటూ ఇటూ కదులుతుండటాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. రాఖీ పౌర్ణమి రోజు ఉదయం 9 గంటల సమయంలో ఈ చింత చెట్టు మొదటిసారి కదిలిందని మళ్లీ ఈ నెల 12వ తేదీన కూడా అదే విధంగా కదిలిందని స్థానికులు చెబుతున్నారు. ఈ వింతను చూసిన ప్రజలు ఇది దేవుడి మహిమ అని బ్రహ్మంగారు చెప్పినట్టుగా అన్నీ జరుగుతున్నాయని అంటున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ ఏడాదిలో ఆ చెట్లు కూడా..
ఈ ఏడాది బాపట్ల జిల్లాలోని నగరం మండలం పెద్దవరం గ్రామంలో ఒక వేప చెట్టు నుండి పసుపు, కుంకుమ పడుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటన శ్రీరామనవమి నుండి ప్రారంభమైందని, దైవ కార్యంగా భావించి స్థానికులు పూజలు చేశారు. అయితే, ఇది మూఢనమ్మకం లేదా కొందరు కావాలని చేసిన పని కావచ్చని కొందరు స్థానికులు ఆరోపించారు. ఇదే సంవత్సరం పూణే జిల్లాలోని పింప్రి-చించ్వాడ్‌లో ఒక చెట్టు నుండి నీళ్లు కారడంతో స్థానికులు దైవ చర్యగా భావించి పూజలు చేశారు. అయితే, మున్సిపల్ అధికారులు తనిఖీ చేసి, చెట్టు కింద ఉన్న పైప్‌లైన్ లీక్ కారణంగా నీరు వస్తున్నట్లు నిర్ధారించారు.

Also Read: Trump on Gold Tariffs: రికార్డ్ స్థాయిలో పెరిగిన పసిడి రేటు.. దిగుమతులపై టారిఫ్ ఉండదని స్పష్టం చేసిన ట్రంప్

గతంలోనూ ఇంతే..
దేవతా విగ్రహాలు పాలు తాగడం, విగ్రహాల నుంచి విభూతి రాలడం, కన్నీ రు కార్చడం వంటి ఘటనలు గతంలో అడపాదడపా చోటుచేసుకున్న సందర్భాలు లేకపోలేదు. 1995 సెప్టెంబర్ 21వ తేదీ ఉదయం ఢిల్లీలోని ప్రఖ్యాత గణేశుడి ఆలయంలో జరిగిన వింత అప్పట్లో సంచలనమైంది. విగ్రహం పాలు తాగుతుందన్న ప్రచారంతో ప్రజలు పాల ప్యాకెట్లు పట్టుకొని గుడికి పోటెత్తారు. ఆ తర్వాత కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఓసారి నంది విగ్రహం పాలుతాగడం, దేశంలోని పలు ప్రాంతాల్లో సాయిబాబా విగ్రహాల నుంచి విభూతి రాలడం వంటి ఘటనలు వెలుగుచూశాయి.

Also Read This: Gujrat Crime: దేశంలో ఘోరం.. భార్యపై తండ్రి, తమ్ముడితో అత్యాచారం చేయించిన భర్త! 

Also Read This: Vijay Sethupathi: విజయ్ సేతుపతికి ఆ కోరిక తీరిస్తేనే అమ్మాయిలకు సినిమాలో ఛాన్స్ ఇస్తాడా.. నిజాలు బయటపెట్టిన డైరెక్టర్?

 

Just In

01

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!