- పేలుడు ధాటికి 20 మందికి పైగా కార్మికులు మృతి
- మరికొందరికి తీవ్ర గాయాలు
- మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్
- ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బెమెతారా ప్రాంతంలో ఘటన
- శిధిలాల కింద చిక్కుకున్న కార్మికులు
- రంగంలో దిగిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్
Chattisgadh gun factory accident 20 above died ndrf team take action:
ఛత్తీస్ గఢ్ లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. బెమెతెరా జిల్లాలోని గడ్ పౌడర్ తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 20 మంది మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో మరికొందరికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. భారీ పేలుడు ధాటికి చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల్ని రాయ్ పూర్ ఎయిమ్స్ కు తరలించారు. ఈ ఘటన పై సమాచారం అందుకున్న రాయ్ పూర్, దుర్గ్ అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి.
100 మందికి పైగా ఉద్యోగులు
ప్రమాద సమయంలో గన్ పౌడర్ ఫ్యాక్టరీలో సుమారు 100 మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. ఫ్యాక్టరీలో పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఫ్యాక్టరీ నుంచి వెలువడిన నల్లటి పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్ముకుంది. ప్రమాదంలో మరణించిన వారి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫ్యాక్టరీ నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని చెబుతున్నారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బెమెతారా ప్రాంతంలో గన్ పౌడర్ కంపెనీలో శనివారం ఉదయం సంభవించిన భారీ పేలుడులో బెర్లా బ్లాక్ లోని బోర్సి గ్రామ శివారు ప్రాంతంలో 20 మంది మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని రాయ్‌పూర్ లోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు అక్కడి చేరుకొని శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. రెండు అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. క్షతగాత్రులలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.