Jr NTR 2 ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Jr NTR: ఎన్టీఆర్ స్పీచ్ వార్ 2 కి మైనస్ గా మారిందా..? సినిమా రిజల్ట్ డౌటే అంటున్న నెటిజన్స్?

Jr NTR: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా సినిమా ” వార్ 2″. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఆగస్టు 14 న రిలీజ్ కానుంది. రెండు రోజుల కిత్రం జరిగిన హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ సంచలన కామెంట్స్ చేశాడు. చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండడంతో… వేలాది మంది ఫ్యాన్స్ తరలివచ్చారు. బడా స్టార్స్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకే వేదికపై ఉండటంతో అభిమానులకు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఫ్యాన్స్ కేకలు, అరుపులతో స్టేడియం అంతా దద్దరిల్లిపోయింది.

Also Read: Vijay Sethupathi: విజయ్ సేతుపతికి ఆ కోరిక తీరిస్తేనే అమ్మాయిలకు సినిమాలో ఛాన్స్ ఇస్తాడా.. నిజాలు బయటపెట్టిన డైరెక్టర్?

ఈ ఈవెంట్ నుంచి వచ్చిన ప్రతి ఫోటో, వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్-హృతిక్ కలిసి స్టేజ్‌పై ‘షర్ట్ కాలర్’ ఎత్తిన వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మాట్లాడుతూ, “ఇప్పటివరకు ఒక్క కాలర్ ఎత్తేవాడిని, ఈసారి రెండు ఎత్తుతున్నా! ఎవరేం అనుకున్నా, ఈ సినిమా అదిరిపోతుంది, పండగ చేసుకోండి!” అంటూ ఫ్యాన్స్‌లో జోష్ నింపాడు. ఆ మాటలతో ఒక్కసారిగా స్టేడియం మొత్తం మోత మారుమోగిపోయింది. ఈవెంట్‌లో ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తారని అభిమానులు అనుకున్నారు. కానీ అది జరగలేదు, అయినా సినిమాపై అంచనాలు మాత్రం తగ్గలేదు.

Also Read: CM Revanth Reddy: మరో మూడు రోజులు భారీ వర్షాలు.. ముందస్తు జాగ్రత్తలపై సీఎం కీలక ఆదేశాలు

అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో మన ముందుకు వస్తున్న ‘వార్ 2’ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో ఎన్టీఆర్-హృతిక్ మధ్య యాక్షన్ సీన్స్, అద్భుతమైన విజువల్స్ అభిమానులను ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా ‘సలాం అనాలి’ పాటలో ఎన్టీఆర్, హృతిక్ డ్యాన్స్ స్టెప్స్ అదిరిపోయాయి. థియేటర్లలో ఈ పాట కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు సినిమాకి శాపంగా మారాయి. మన తెలుగు వాళ్ళు అతని మాట్లాడిన మాటలపై చాలా సీరియస్ అవుతున్నారు. ఎన్నడూ లేనిది ఎన్టీఆర్ ఇలా కోపంతో ఊగిపోతున్నడేంటి? బాలీవుడ్ కి వెళ్తే అలా ఎక్కువ మాట్లాడాలా? దీని వలన సినిమాకి చాలా నష్టం జరగడం పక్కా అంటూ సన్నిహితులు కూడా చెబుతున్నారు.

Also Read: Bhatti Vikramarka: పన్ను భారం లేకుండా గ్రీన్ పవర్ ఉత్పత్తితో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!