Uttam Kumar Reddy ( image CREDIt: TWItter)
తెలంగాణ

Uttam Kumar Reddy: ఆధునిక పరిజ్ఞానాన్ని అమలులోకి తేవాలి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు

Uttam Kumar Reddy: నీటిపారుదల శాఖ సెంట్రల్ డిజైన్ విభాగం పటిష్టతకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మేడిగడ్డ ఉదంతంలో జాతీయ భద్రత సంస్థతో పాటు జస్టిస్ ఘోష్ కమిషన్ చేసిన వ్యాఖ్యలతో సీడీవో ప్రతిష్ట దెబ్బతిన్నదన్నారు. అలాంటి వ్యాఖ్యలపై సీడీవో పునఃసమీక్షించుకుని సంస్కరణలు చేపట్టడం అత్యవసరమన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయ, సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు.

Also Read: Panchayat Elections: గత రిజర్వేషన్లే కొనసాగింపు? ఎన్నికల నిర్వహణపై దృష్టి

సీడీవో ప్రతిభకు పట్టం

సచివాలయంలో నీటిపారుదల శాఖాధికారులతో ఆయన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్(Uttam Kumar Reddy) మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా సీడీవోను బలోపేతం చేయాలన్నారు. ప్రాజెక్టుల డిజైన్‌ల రూపకల్పనలో ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అందుకు అవసరమైన లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో ముందుండాలన్నారు. గతంలో సీడీవో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. వందేళ్ల క్రితం నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు(Nizamsagar Project) నుంచి మొదలు పెడితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్మించిన ప్రధాన ప్రాజెక్ట్ నిర్మాణాల్లో వినియోగించిన సాంకేతికత తెలంగాణ సీడీవో ప్రతిభకు పట్టం కడుతుందన్నారు. అలాంటి ప్రతిభ చాటుకునేందుకు సీడీవో సంస్థ కృషి చేయాలని ఉద్బోధించారు.

నష్టం కలుగ నివ్వబోము
ఆ సంస్థ విశ్వసనీయత గలిగిన సంస్థకు ఎట్టి పరిస్థితిల్లోనూ నష్టం కలుగనివ్వబోమని లోపాలు సరిదిద్ది అదే ప్రతిష్టను ఇనుమడింప చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీడీవోలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తక్షణం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఐఐటీ, ఎన్ఐటీ‌ల వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల నుంచి నీటిపారుదల శాఖలో నియమితులైన ఇంజినీర్లను సీడీవోలో పోస్టింగ్ ఇవ్వబోతున్నట్లు మంత్రి తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నవి కావడంతో ప్రతిభావంతులైన ఇంజినీర్ల సేవలు వినియోగించుకోవాలన్నారు.

ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్దిష్టమైన ఇంజినీరింగ్, సృజనాత్మక అవసరమని అది అత్యుత్తమ శిక్షణ పొందిన నిపుణుల ద్వారానే సాధ్యపడుతుందన్నారు. ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఐఐటీ హైదరాబాద్, జే‌ఎన్‌టీ‌యూ, టీ‌ఎస్ జెన్ కో వంటి సంస్థలకు చెందిన వారిని నియమించే ముందు టైంబౌండ్ పద్దతిలో డిజైన్‌ల రూపకల్పన‌లో ఉత్తమ నైపుణ్యాలను ప్రదర్శించడంతో పాటు సమయపాలనకు పెద్దపీట వేయాలని ఆదేశించారు. నల్లగొండ జిల్లాలో నెల్లికల్లు, డిండి ఎత్తిపోతల పథకాల డిజైన్‌లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రైతులకు నీరు అందించడంలో జరుగుతున్న జాప్యం దృష్టిలో పెట్టుకుని డిజైన్‌లకు తక్షణం ఆమోదించాలని అధికారులను ఆదేశించారు.

 Also Read: Danish Zoo: ‘మీ పెంపుడు జంతువులు ఇవ్వండి.. జూలో జంతువులకు వేస్తాం’

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు