Komatireddy Raj Gopal: రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Komatireddy Raj Gopal (imagecredit:twitter)
Political News

Komatireddy Raj Gopal: మంత్రి పదవిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు!

Komatireddy Raj Gopal: మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Raj Gopal Reddy) మరో సారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు మంత్రి పదవి ఇవ్వకపోవడానికి కారణం సమీకరణలు కుదరకపోవడమే అని అంటున్నారని అన్నారు. నన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని అన్నారు. నాకు పదవులు ముఖ్యం కాదని అన్నారు. నాకు పదవుల కంటే మునుగోడు నియోజక వర్గ అభివృద్దే ముఖ్యమని అన్నారు. ఆ నాడు నేను చెప్పాను మా నియోజక వర్గానికి రావలసిన నిధుల విషయంలో ఎ మాత్రం వెనకడుగు వేయోద్దని చెప్పానని, ఈ నాడు కూడా ఇదే చెప్తున్నానని అన్నారు. నాకు అన్యాయం చేసిన పర్లేదు కానీ నా నియోజక వర్గ ప్రజలకు అన్యాయం చేయోద్దని అన్నారు.

మంత్రులు ఉండటం తప్పా?

ఆనాడు నాకు మాట ఇచ్చారు మీరు ఇచ్చినప్పుడే ఇవ్వండి కానీ మా అభివృద్దిని మాత్రం ఆ పోద్దని అన్నారు. నాకు ఇస్తామన్న మాట ఆలస్యమైందని అన్నారు. ఇప్పుడు సమీకరణలు కుదురుత లేవని భట్టి విక్రమార్క అంటున్నారని, మనసుంటే మార్గం ఉంటుందని అన్నారు. 9 మంది ఎమ్మెల్యే ఉన్న ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు. అలాంటిది 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండకు ముగ్గురు మంత్రులు ఉండటం తప్పా? చెప్పండి అని అన్నారు. మహబూబ్ నగర్‌కి ముఖ్యమత్రి పదవి ఇచ్చామని, రేవంత్ రెడ్డి(Revanth Reddy) కి ముఖ్యమంత్రకి పదవి ఇచ్చినప్పుడు ఇద్దరు అన్న తమ్ముల్లకు మంత్రి పదవి ఇస్తే తప్పేంటని అన్నారు. మా అన్నదమ్ములం ఇద్దరం సమర్థులమే, గట్టి వాళ్లమే మాకివ్యోచ్చుగా అని అన్నారు.

Also Read; Manda krishna: పెన్షన్లపై కేసీఆర్ నోరు తెరిచి అడగట్లేదు.. మందకృష్ణ సంచలన కామెంట్స్!

నాకు అన్యాయం జరిగినా పర్లేదు

పదవులు ఎప్పడు ఎవరికి ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ(Congress) అధిస్దానం నిర్నయిస్తుందని అన్నారు. ఆలస్యమైన సరే నేను ఓపిక పడుతున్నానని అన్నారు. పదవులుకు నేను ఆశ పడేవాన్ని కాదని నా మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే రాజ్ గోపాల్ రెడ్డికి అన్యాయం జరిగినట్లే అని అన్నారు. నాకు అన్యాయం జరిగినా పర్లేదు కానీ.. మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని గత ప్రభుత్వానికి చెప్పినా ఇప్పుడు కూడా చెబుతున్నా అని అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకంటే మునుగోడు నియోజక వర్గమే అత్యదికంగా వెనకబడిందని అని అన్నారు. మునుగోడులో కరెంటు సమస్యలు, నీల్ల సమస్యలు ఉన్నాయని అన్నారు. ఎంతో శ్రమపడితే కానీ ఢిండి ప్రజెక్టు మనకు వచ్చిందని, ఆ నాడు కమ్యునిస్టులు ప్రాజెక్టు కోసం కష్ట పడ్డారని గుర్తు చేశారు.

Also Read: CM Relief Fund: సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం.. ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

Just In

01

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!