sati-leelavathi( image source :X)
ఎంటర్‌టైన్మెంట్

Sathi Leelavati: ‘సతీ లీలావతి’ నుంచి ఫస్ట్ మెలొడీ వచ్చేసింది.. చూశారా..

Sathi Leelavati: లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను ‘చిత్తూరు పిల్ల’ అంటూ సాగే ఈ పాటను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘భీమిలీ కబడ్డీ జట్టు’, ‘ఎస్‌.ఎం.ఎస్‌’(శివ మ‌న‌సులో శృతి) ఫేమ్ తాతినేని స‌త్య దర్శకత్వం వహిస్తున్నారు. భార్య‌, భ‌ర్తల మధ్య ఉండే అనుబంధాన్ని ఎమోష‌నల్‌గా ఎంట‌ర్‌టైనింగ్‌గా తెర‌కెక్కించినట్టు ఇటీవల విడుదలైన టీజర్‌ను చూస్తే అందరికీ అర్థమై ఉంటుంది. అసలే అందులో అందాల రాక్షసి ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

Read akso- Bhatti Vikramarka: పన్ను భారం లేకుండా గ్రీన్ పవర్ ఉత్పత్తితో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఇక తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన ‘చిత్తూరు పిల్ల’ అంటూ సాగే ఈ పాటను వనమాలి రచించగా.. నూతన మోహన్, కృష్ణ తేజస్వీ, రితేజ్ జి రావు సంయుక్తంగా ఆలపించారు. మిక్కీ జే మేయర్ అందించిన బాణీ సుతిమెత్తగా అందరినీ గుండెల్ని తాకేలా ఉంది. ఇక బృందా మాస్టర్ కొరియోగ్రఫీతో ఈ లిరికల్ వీడియో ఎంతో చూడముచ్చటగా మారింది. పెళ్లి సంబరాల్లో ఈ పాటను ప్లే చేసేలా మేకర్లు తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సతీ లీలావతి’ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. వీలైనంత త్వరగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా ఈ చిత్రాన్ని రూపొందించారు నిర్మాతలు.

Read akso- Prajavani: జీహెచ్ఎంసీ ప్రజావాణిలో 150 ఫిర్యాదులు.. సత్వర పరిష్కారానికి అధికారుల చర్యలు

ఈ పాటను చూస్తుంటే ఆహ్లాదకరమైన వాతావరణంలో తీసినట్టు తెలుస్తుంది. సరళమైన పదాలతో అందరికీ అర్థం అయ్యేలాగా స్వచ్ఛమైన తెలుగు పాటలా అనిపిస్తుంది. మిక్కీజే మేయర్ అందించిన సంగీతం ఈ పాటకు మరింత బలం చేకూర్చింది. పెళ్లి సందర్భంగా ఈ పాట రావడంతో చాలా రోజుల తర్వాత మంచి మెలొడీ కూడా కుదిరింది. సంగీత దర్శకుడు ఎప్పటిలాగే ఈ పాటను అందరూ పాడుకునే విధంగా కంపోజ్ చేశారు. లావణ్య, దేవ్ మోహన్ ల కెమిస్ట్రీ బాగా కుదిరింది. ప్రతిఒక్కరి జీవితంలో జరిగే కొన్ని ఘట్టాలను దర్శకుడు చాలా అందంగా చూపించాడు. ఓవరాల్ గా ఈ పాట అందరినీ మెప్పించేలా ఉంది.

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్