Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పరదా’ అనే లేడీ ఓరియంటెడ్ చిత్రం ఆగస్టు 22, 2025న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. దీనిలో సంగీత, దర్శనా రాజేంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఒక విచిత్రమైన ఊరి నేపథ్యంలో జరుగుతుంది. ఇక కథ విషయానికొస్తే, ఇక్కడ అమ్మాయిలు తమ ముఖాలను పరదాలతో కప్పుకుంటారు.
Also Read: Rana Daggubati: మూడు గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు.. రానా నుంచి ఏం తీసుకున్నారంటే?
ఈ కథలో అనుపమ పాత్ర ఊరిని విడిచి బయటి ప్రపంచంలో సాహసాలు చేస్తూ, తిరిగి ఊరిలోని ఒక సమస్యను పరిష్కరించడానికి వస్తుంది. ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ సోషియో-ఫాంటసీ శైలిలో రూపొందించబడింది. ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమా ప్రమోషన్ల స్పీడ్ పెంచారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం నమ్ముతుంది.
Also Read: Tollywood: తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మినిస్టర్స్‌తో భేటీలు.. టాలీవుడ్‌లో అసలేం జరుగుతుంది?
అయితే, ఎవరూ చేయలేని సాహసం ఈ ముద్దుగుమ్మ చేసింది. ఏకంగా రోడ్డు పై “పరదాలమ్మా పరదాలు.. రంగు రంగుల పరదాలు.. డిజైన్ గల పరదాలు తీసుకోవాలమ్మా తీసుకోవాలి” అంటూ అమ్ముతుంది. వైజాగ్ బీచ్ రోడ్డు లో సందడి చేసిన అనుపమ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: Rahul Gandhi: దిల్లీలో హై టెన్షన్.. రాహుల్, ప్రియాంక అరెస్ట్.. రాజధానిలో ఏం జరుగుతోంది?
చివరికి సినిమా వాళ్ళు ఇలా తయారయ్యారు. నేను ఒక్కసారిగా చూసి ఎవరో అమ్మాయి అనుకున్నా.. చూస్తే కానీ అర్థం కాలేదు అనుపమ అని. నువ్వే మా ఊరు రా.. 10 పరదాలు ఇస్తాము. నువ్వు ఎంత కాకా పట్టిన సినిమా చూడము. పనిలో పని పాత ఇనుప సామాన్లు కూడా అమ్ము అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.