Gadwal district: చదువుతో పాటు ప్రతి విద్యార్థి క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ ప్రతిభ చూపుతూ, అన్ని విభాగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్(Collector BM Santosh అన్నారు. జిల్లా కేంద్రంలోని బాల భవన్‌లో ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన “దేశభక్తిని చాటుదాం” కార్యక్రమంలో గద్వాల్ శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(Krishna Mohan Reddy) తో కలిసి పాల్గొన్నారు.
మాదకద్రవ్యాల నివారణ
ఈ సందర్భంగ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల ప్రతిభను వెలికితీయడంలో ప్రజా నాట్యమండలి చేపట్టిన ఈ కార్యక్రమం ఆదర్శనీయం అని పేర్కొన్నారు. సెల్‌ఫోన్(Cell Phone) వాడకం లాభనష్టాలు, గ్రామీణ జీవనం, మాదకద్రవ్యాల నివారణ వంటి సమాజానికి అవసరమైన అంశాలపై పోటీలను నిర్వహించడం విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడంలో కీలకమని ఆయన అన్నారు. బాలభవన్‌లో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నేర్చుకొని వివిధ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చి గద్వాల(Gadwala)కు పేరు తెస్తున్నారని పేర్కొన్నారు.
తాను ఎంత బిజీగా ఉన్నా కూడా విద్యార్థులతో సమయం గడిపేందుకు ఈ కార్యక్రమానికి వచ్చానని చెప్పారు. భవిష్యత్తులో స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే వంటి వేడుకల సందర్భాల్లో ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. చదువుతో పాటు ప్రతి విద్యార్థి క్రీడ(Sports)లు, సాంస్కృతిక రంగాల్లో కూడా రాణించాలని సూచించారు.
Also Read: Sand Scam: ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇసుక దందా.. పట్టించుకోని అధికారులు
సెల్‌ఫోన్ అధిక వాడకం వల్ల
గద్వాల్ శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా నాట్యమండలి కమ్యూనిస్టు భావజాలంతో మాత్రమే కార్యక్రమాలు చేస్తుందని అనుకున్నప్పటికీ, ఇలాంటి స్ఫూర్తిదాయకమైన, విద్యార్థులకు ఉపయోగకరమైన కార్యక్రమాలు కూడా నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. సెల్‌ఫోన్ అధిక వాడకం వల్ల మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయని, విద్యార్థులు మంచిది–చెడ్డదీ ఏంటో గుర్తించే సామర్థ్యం పెంపొందించుకోవాలని సూచించారు.
మాదకద్రవ్యాల(Narcotics) అలవాటు యువత భవిష్యత్తును చెడగొడుతుందని హెచ్చరిస్తూ, దేశభక్తి, క్రమశిక్షణ, విద్య పట్ల ఆసక్తి పెంచుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో 500 మంది కూర్చునే సదుపాయంతో ఆడిటోరియం నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెస్తానని తెలిపారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక సంప్రదాయ రంగాల్లోనూ రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ బోర్డ్ నోడల్ అధికారి హృదయరాజ్(Hrudayaraj), మండల విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్(Srinivass Goud), ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి(Srinivass Reddy), ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Also Read: TGSRTC: రాష్ట్రంలో స్పెషల్ బస్సుల్లో అదనపు చార్జీలు: టీజీఎస్ఆర్టీసీ