Kotha Venkat Reddy: సమస్యను పరిష్కరించకపోతే ధర్నా!
Kotha Venkat Reddy (Imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Kotha Venkat Reddy: సమస్యను పరిష్కరించకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా!

Kotha Venkat Reddy: రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం మంచిది కాదని, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అరిష్టమని రైతు సంఘం మండల కార్యదర్శి కొత్త వెంకట్ రెడ్డి(Venkat Reddy), బహుజన సామాజిక కార్యకర్తలు సురేష్ బాబు ,సంతోష్ ,బాలాజీలు అన్నారు. రైతులతో కలిసి తొర్రూరు(Thorrur) పట్టణ కేంద్రంలోని అన్నారం రోడ్డు వద్ద పిఎసిఎస్(PACS) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యూరియా(Urea) షాపు ముందు రోడ్డుమీద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సకాలంలో రైతులకు యూరియా అందించటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు.

Also Read: TS News: కలెక్టర్‌పై గరంగరమైన ఎమ్మెల్యే‌కు ఉద్యోగుల సీరియస్ వార్నింగ్

మరో దాంతో లింకుపెట్టి

యూరియా9Urea) బ్లాక్ మార్కెటింగ్ ద్వారా అధిక ధరలకు ప్రైవేట్(Private) షాపులు అమ్ముతున్నారని దీన్ని అధికారులు అరికట్టాలని వారు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు ప్రైవేటు షాపులు యూరియాను అమ్ముతున్నాయని, దీనిని అరికట్టి రైతులందరికి సరైన న్యాయం చేయాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో రైతుల జీవితాలు ఆగమవుతున్నాయని అన్నారు. షాపు నిర్వాహకులు యూరియాను ఇచ్చేటప్పుడు యూరియాతోపాటు గుళికలు తీసుకోవాలని లింకులు పెట్టి ఇస్తున్నారని, రైతులు(Farmers) అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంటున్నామని వాపోతున్నారు.

తెలంగాణ(Telangana) రాష్ట్రంలో రైతాంగ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉద్యమాలు నిర్వహిస్థామని మండల నయకులు ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ యాకన్నా, వీరన్న స్థానిక రైతులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Also Read: Jadcharla MLA: అక్కడ ఫ్లాట్స్ కొనొద్దు.. మోసపోతారు.. ప్రజలకు ఎమ్మెల్యే వార్నింగ్!

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..