Manda krishna: వితంతువులు, వృద్ధులను ఒంటరి మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ(Manda krishna) మాదిగ ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District)పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారంలో ఏర్పాటు చేసిన మహా గర్జన సన్నాహక సదస్సు సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అధికారంలోకి వచ్చిన నెలలోనే వితంతువులు, వృద్ధులు, చేయూతదారులకు 4వేలు, వికాంగులకు 6వేలు, అంగవైకల్యం కలిగిన వికలాంగులకు 15వేలు ఇస్తామని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను గుర్తు చేశారు.
Also Read: Khammam District: పౌరులకు రాజ్యాంగ విద్య అందించాలి.. సీపీఎం నేత కీలక వ్యాఖ్యలు
ఆగస్టు 13న భారీ బహిరంగ సభ
20 నెలలు అవుతున్నా అతి గతి లేదని, పెన్షన్‌దారులను సర్కార్ పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ప్రతిపక్షం కూడా నోరు మెదపడం లేదన్నారు. ‘పెన్షన్లు ఇచ్చేటోడు ఇవ్వడు.. అడిగేటోడు అడగడు’ అని సీఎం రేవంత్,(Revanth Reddy) ప్రతిపక్ష నేత కేసీఆర్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 50 లక్షల మంది వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు ఉన్నారని 20 నెలల్లో ఒక్కొక్కరు 40వేలు నష్టపోయారన్నారు. నెలకు వెయ్యి కోట్లు నష్టమని 20 నెలలు రూ.20 కోట్లు నష్టపోయారన్నారు. హైదరాబాద్‌లో ఆగస్టు 13న జరిగే భారీ బహిరంగ సభతో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని మందకృష్ణ(Manda krishna) చెప్పారు.
Also Read: CM Revanth Reddy: హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన