Adluri Lakshman: వికలాంగుల కళ్లలో ఆనందం చూడటమే తమ లక్ష్యమంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్(Minister Adluri Lakshman) పేర్కొన్నారు. మంత్రి అడ్లూరిని, కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్యను వికలాంగుల ఉద్యోగ సంఘం నేతలు సన్మానించారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్, చైర్మన్ ముత్తినేని వీరయ్యలు మాట్లాడుతూ..జీవో 34 ద్వారా వికలాంగులకు మేలు జరుగుతుందన్నారు. వికలాంగుల సంక్షేమ మే ప్రధాన ద్యేయం గా పనిచేస్తున్నామని, వికలాంగుల కుటుంబాలలో సైతం, వారీ తల్లీ తండ్రులు కండ్ల లో ఆనందం చూడటమే తమ ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
ఒక్కో సంఘానికి రూ.15 వేలు
వికలాంగుల స్వయం సమృద్ధి కోసం వేల సంఖ్యల్లో వికలాంగుల స్వయం సహాయక సంఘాల(Self-help groups for the disabled)ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆయా సంఘాలకు ఆర్ధికంగానూ ఊతం అందిస్తామన్నారు. వికలాంగుల స్వయం సహాయక సంఘాల కి ఒక్కో సంఘానికి రూ.15 వేల చొప్పున 2367 సంఘాల కి 3కోట్ల 55లక్షలు, వికలాంగుల వ్యక్తి గత సబ్సిడి రుణాలు కోరకు రూ5 కోట్ల రూపాయలను విడుదలచేశామన్నారు. వికలాంగుల ఉద్యోగుల ట్రాన్స్ఫర్ లపై గత ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని, కానీ ప్రజాపాలన ప్రభుత్వంలో వికలాంగుల ఉద్యోగులకి ట్రాన్స్ఫర్ లలో రిజర్వేషన్ కల్పిస్తూ ఉద్యోగులు, ఆయా కుటుంబాలకు అండగా నిలిచామన్నారు.
Also Read: DGP Jitender: ఆర్థిక నేరాలపై దృష్టి పెట్టండి.. డీజీపీ కీలక సూచనలు
ఈ జీవో(GO) కోసం
కేంద్రం వికలాంగుల పెన్షన్ ను 300 నుంచి 3 వేలకు పెంచాలన్నారు. వికలాంగుల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హబీబ్ మాట్లాడుతూ..గడిచిన పదేళ్లలో కేసీఆర్(KCR) ప్రభుత్వం వికలాంగులపై వివక్ష చూపిందన్నారు. ఈ జీవో(GO) కోసం ఎక్కని మెట్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, (Bhatti Vikramarak) మంత్రి, కార్పొరేషన్ చైర్మన్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Also Read: Chiranjeevi: వారి వేతనాల పెంపు విషయంపై క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్