Guvvala Balraju: రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS) కు చెక్ పెట్టడంలో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్(operation akarsh) కు బీజేపీ తెరదీసింది. మొయినాబాద్ ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో కీలకంగా ఉన్న నలుగురిలో ఒకరైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(Guvala Balraju) కాషాయతీర్థం పుచ్చుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆయన చేరికపై ఒక వర్గం నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. గువ్వల బాలరాజు చేరికను కొందరు వ్యతిరేకిస్తున్నారు. కాగా ఉమ్మడి పాలమూరు(Palamuru) జిల్లాకు చెందిన కీలక నేతలు గైర్హాజరవ్వడం దీనికి బలం చేకూర్చేలా ఉంది. స్థానిక నేతల నుంచి వ్యతిరేకత రావడంతో కొందరు నేతలు మాత్రం వచ్చారు. ఇంకొందరు గైర్హాజరయ్యారనే చర్చ జరుగుతోంది.
మాజీ ఎంపీ రాములు సైతం దూరం
నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గువ్వల బాలరాజు కాషాయ పార్టీలో చేరారు. అయితే పాలమూరు ఎంపీ డీకే అరుణ(DK Aruna)తో పాటు మాజీ ఎంపీ రాములు(Ramulu) సైతం గైర్హాజరయ్యారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎంపీ రాములు తనయుడు పోతుగంటి భరత్ సైతం దూరమయ్యారు. వీరి చేరికకు పాలమూరు జిల్లాకు చెందిన ఇతర నేతలు కూడా దూరంగా ఉండటంతో శ్రేణుల్లో గువ్వల చేరికపై ఉన్న వ్యతిరేకత అర్థమవుతోందనే చర్చ పొలిటికల్(Political) సర్కిల్స్ లో జరుగుతోంది. పార్టీలో చేరికలతో బలం పెంచుకోవాలని కమలం పార్టీ ఒకవైపు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నా పార్టీలో ఆధిపత్య పోరు, వ్యతిరేకత కారణంగా ఎప్పటికప్పుడు విమర్శల పాలవుతూనే ఉండటం గమనార్హం.
Also Read: Gadwal’s Jodu Panchalu: చరిత్ర ఆనవాయితీగా తిరుపతి వెంకన్న స్వామికి జోడు పంచెలు
గో బ్యాక్ డీకే అరుణ డౌన్ డౌన్
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొన్నటికి మొన్న ఎంపీ డీకే అరుణ(MP DK Aruna) వర్సెస్ శాంతికుమార్(Shanthi Kumare) అన్నట్లుగా పరిస్థితి మారింది. ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ (Ram Chender Rao)రావు ఎదురుగానే డీకే అరుణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గో బ్యాక్ డీకే అరుణ, డౌన్ డౌన్ అంటూ రాంచందర్ రావు ఎదురుగా నినాదాలు చేశారు. కాగా తాజాగా గువ్వల జాయినింగ్ కు శ్రేణులు దూరంగా ఉండటం చూస్తుంటే వ్యతిరేకత ఎంతలా ఉందనేది అర్థమవుతోంది. ఇప్పటికే పలువురు నాయకులు, కార్యకర్తలు గువ్వలను అవకాశవాదిగా విమర్శలు చేస్తున్నా రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాత్రం గువ్వల న్యాయవిద్యలో పీహెచ్డీ పట్టా పొందారని, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారంటూ కొనియాడటాన్ని ఎవరూ జీర్ణించుకోవడంలేదని తెలుస్తోంది. అంతేకాకుండా కేంద్ర మంత్రి బండి సంజయ్((Bandi Sanjeay) తోనూ గువ్వల భేటీ అవ్వడం గమనార్హం. ఇదిలా ఉండగా ఏది ఏమైనా గువ్వల కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాయకులు, కార్యకర్తలు ఆయన్ను కలుపుకుని ముందుకు వెళ్తారా? లేదా? అనేది చూడాలి.
Also Read: Hydraa: మల్కం చెరువు మునక కారణాల అన్వేషణ.. కమిషనర్ రంగనాథ్