Delhi highway road accident: మృత్యుయాత్రగా మారిన తీర్థయాత్ర
Truck-Mini bus accident
క్రైమ్

UP accident:మృత్యుయాత్రగా మారిన తీర్థయాత్ర

Jammu-Delhi national highway road accident 7 members died:
జమ్మూ, ఢిల్లీ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మరణించగా మరో 20 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ నుంచి వీరంతా మినీ బస్సులో బయలుదేరి వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించేందుకు బయలుదేరారు. బస్సులో షుమారు 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. అంబాలా సమీపంలో బస్సు ముందునుంచి వెళుతున్న ట్రక్కు డ్రైవరు సడెన్ బ్రేకులు వేయడంతో దాని వెనుకే వస్తున్న మినీబస్సు బలంగా ట్రక్కును ఢీకొంది. బస్సుకు ముందు వెళ్తున్న ట్రక్కు అకస్మాత్తుగా బ్రేక్‌లు వేయడంతో, బస్సు డ్రైవర్ సకాలంలో వాహనాన్ని కంట్రోల్ చేయలేపోయాడు. దీంతో వేగంగా ప్రయాణిస్తున్న బస్సు ట్రక్కును ఢీకొట్టింది. బస్సు ముందు భాగం చితికిపోయింది.

పారిపోయిన ట్రక్కు డ్రైవర్

బస్సులోనే ప్రయాణికులు చిక్కుకుపోయారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన  సభ్యులు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన మిగతా వారికి దగ్గరిలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 20 మందికి పైగా తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో పెద్ద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ట్రక్కు డ్రైవర్ సంఘటనా స్థలం నుండి పారిపోయాడని, అయితే అతని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడిన ధీరజ్ అనే వ్యక్తి మాట్లాడుతూ, ట్రక్కు ముందు ఉన్న కారు పెట్రోల్ పంపు వద్ద అకస్మాత్తుగా మలుపు తిరిగింది, దాంతో ట్రక్ డ్రైవర్ తన బ్రేక్‌లు వేయడంతో, దాని వెనక ఉన్న మా బస్సు సడన్‌గా కంట్రోల్ కాలేకపోవడంతో ట్రక్కును ఢీకొట్టినట్లు తెలిపాడు.

Just In

01

Kerala News: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా.. పంచాయతీ ఎన్నికల్లో యూటీఎఫ్ సత్తా

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!