Bhatti Vikramarka: మధుర నియోజకవర్గంలో ఐదు మండలాలకు మధ్యర ఉన్న ఏరులలో వృధాగా పోతున్న నీటికి రూపమే జవహర్ ఎత్తిపోతల పథకమని రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramaraka) పేర్కొన్నారు. మధిర నియోజకవర్గం లోని వంగవీడు ప్రాంతంలోని జవహర్ ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి(Uttam Kumr Reddy), కోమటిరెడ్డి వెంకటరెడ్డి లతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ… ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటేనే వ్యవసాయానికి ప్రతిరూపం ఉన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా పంట దిగుబడి తీసుకొచ్చే జిల్లాగా ఖమ్మం కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. అలాంటి రైతుల అభివృద్ధి కోసమే జవహర్ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లా చిరకాల కోరిక మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం జవహర్ ఎత్తిపోతల పథకం ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మిస్తున్నామన్నారు.
నెహ్రూ ఆధ్వర్యంలోనే నాగార్జునసాగర్
మధిర నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఉన్న 33,000 మంది రైతుల ఆయకట్టుకు మీరందించడమే లక్ష్యంగా ఈ జవహర్ ఎత్తిపోతల ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలే నాయకులుగా వ్యవహరించి నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కృషి చేశారని కొనియాడారు. నాడు టిఆర్ఎస్ పాలనలో భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్న ఒక్క పొడెం వీరయ్య తో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం చుట్టి వచ్చామన్నారు. నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా వచ్చే నీటి ద్వారానే పాలేరు నుంచి సత్తుపల్లి వరకు ఆయకట్టు రైతులు ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారన్నారు. వారందరికీ వ్యవసాయం చేసుకునేందుకు మరిన్ని నీళ్లు అందించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం జవహర్ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తుందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రధానిగా పనిచేసిన జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టించామని చెప్పారు.
Also Read: Hyd Rain Updates: భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలం.. ట్రాఫిక్ జామ్ ఏరియాలు ఇవే!
పాలేరు నుంచి సత్తుపల్లి వరకు
నాగార్జునసాగర్ నీటితోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాణ్యమైన వ్యవసాయం చేసుకునేందుకు అవకాశం కలిగిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక గత పదేళ్లలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు టిఆర్ఎస్ పార్టీ చేసింది ఏమి లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన ఖమ్మం జిల్లా రైతులకు మేలు చేయాలని లక్ష్యంతో జవహర్ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మిస్తుందని తెలిపారు. నాగార్జునసాగర్ ద్వారా వచ్చే లెఫ్ట్ కెనాల్ వన్ టీఎంసీ నీళ్లతోటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి సత్తుపల్లి వరకు రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా వన్ టీఎంసీ నీటిని అందించకపోతే నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టకముందు ఉన్న దుస్థితి ఈ ఖమ్మం జిల్లాకు వచ్చే పరిస్థితి నేపథ్యంలో ఈ ప్రాంత రైతులకు మేలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం జవహర్ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తుందని వెల్లడించారు. ఖమ్మం జిల్లా రైతులకు మేలు చేయాలని కృషి చేస్తున్న రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి డిప్యూటీ సీఎం ఖమ్మం రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి
రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చర్యలతోనే బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయిందని, రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సరఫరా అయ్యే నీళ్లు ఆగాయని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును దయచేసి ఆపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన బిడ్డలపై ఏమాత్రం అభిమానం ఉన్న మా రాష్ట్రం నుంచి మీ రాష్ట్రంలో కలుపుకున్న ఏడు మండలాల ప్రజలను, 2లక్షల ఎకరాల భూములను మాకు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. ఏడు మండలాలను పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం కాకుండా పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం ప్రాజెక్టుల నిర్మాణం అయ్యాక, ఫ్లడ్ వాటర్ వాటా అయిపోయాకనే, మేము ఓడిసిపట్టాక మిగిలిన నీటి కోసమే మీరు ఆశించాలని స్పష్టం చేశారు. ఒక్క నీటి చుక్కను కూడా తెలంగాణ నుంచి వదిలేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేదని వెల్లడించారు.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛలో ప్రచురితమైన చాలాన్ల దోపిడి కథనం వైరల్