Mahesh Kumar Goud: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేపట్టిన జనహిత పాదయాత్రపై ఏఐసీసీ నుంచి ప్రశంసలు లభించాయి.ఈ పాదయాత్ర ద్వారా లీడర్లు, కార్యకర్తల మధ్య సమన్వయం పెరుగుతుందని అగ్రనేతలు భావిస్తున్నారు. తమ ఇంటర్నల్ సర్వేల ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకున్న ఏఐసీసీ..పీసీసీ చీఫ్ కు అభినందనలు తెలిపినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల ముందు తలపెట్టిన ఈ పాదయాత్ర ద్వారా పార్టీకి మరింత మైలేజ్ పెరుగుతుందని అగ్రనాయకత్వం ధీమాతో ఉన్నది. జూలై 31వ తేది నుంచి ఆగస్టు 4 వరకు నిర్వహించిన పాదయాత్రపై ఏఐసీసీ అధ్యయనం చేసింది. రంగారెడ్డి జిల్లా పరిగితో మొదలై, మెదక్(Medak) జిల్లా వరకు పాదయాత్ర ను నిర్వహించారు. ఇందులో ఆందోల్ నియోజకవర్గంలో ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్ అద్భుతంగా ఉన్నదంటూ ఏఐసీసీ కితాబిచ్చింది. సీనియర్ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గంలో గతంతో పోల్చితే పార్టీకి మరింత ఎక్కువ మైలేజ్ వచ్చినట్లు ఇంటర్నల్ సర్వేలో తేలాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించాలనే ఆదేశాలతో పీసీసీ చీఫ్ మరో అడుగు ముందుకు వేశారు.
పాదయాత్రలు కాంగ్రెస్‌లో జోష్
ఈ నెల 23 తర్వాత మళ్లీ జన హిత పాదయాత్ర మొదలు కానున్న ది. ఈ యాత్రలో ఇప్పటికే ఏఐసీసీ ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) భాగస్వామ్యం కాగా, ఇక నుంచి విడతలు వారీగా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramaraka) తో పాటు మంత్రులూ హాజరు కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు చేసిన పాదయాత్రలు కాంగ్రెస్ లో జోష్ ను నింపాయని, తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం వరించినట్లు అగ్రనేతలు భావిస్తున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల్లోనూ పీసీసీ చీఫ్ పాదయాత్ర కలిసి వస్తుందనే ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ కు పాదయాత్రలు ఎప్పుడూ మంచి మైలేజ్ ను ఇస్తాయని ఓ సీనియర్ నాయకుడు చెప్పారు. ఉమ్మడి ఏపీలోనూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ పాదయాత్రను ఆయన గుర్తు చేశారు.
గ్రౌండ్ స్ట్రాంగ్ కు?
ఇప్పటి వరకు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, తదితర ముఖ్య నాయకుల ఎన్నికల కోసం క్షేత్రస్థాయిలోని కేడర్ నిర్వీరామంగా పనిచేసింది. తద్వారా కాంగ్రెస్ కు పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు క్షేత్రస్థాయి నాయకుల కోసం అగ్రనేతలు కష్టపడాల్సిన సమయం వచ్చింది. గ్రౌండ్ లో పార్టీ బలంగా ఉన్నప్పుడే స్టేట్ ముఖ్య లీడర్లంతా రాజకీయాన్ని తమకు అనుకూలంగా మల్చుకునే వెసులుబాటు సంపూర్ణంగా ఉంటుంది. లేకుంటే పార్టీ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దీంతోనే కార్యకర్తల ఎన్నికల్లో ఆయా అభ్యర్ధులను గెలిపించే బాధ్యతను స్వయంగా తానే తీసుకుంటానని గతంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీనిలో భాగంగానే పార్టీ తరపున పీసీసీ అధ్యక్షుడు గ్రౌండ్ లీడర్లను గెలిపించుకోవడం కోసం ఇప్పట్నుంచే పార్టీ బలోపేతంపై శ్రమిస్తున్నారు. పాదయాత్ర చేస్తూనే ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ సమస్యలను గుర్తించి సరిదిద్దుతున్నారు. అంతేగాక సమన్వయంగా పనిచేస్తేనే పార్టీ కి మంచి రిజల్ట్స్ వస్తాయని టాస్క్ ఇస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్స్, చేయబోతున్న పథకాలు, ప్రజలకు జరుగుతున్న మేలును ఎప్పటికప్పుడు పీసీసీ చీఫ్ తనదైన శైలీలో చెప్పున్నారు.
Also Read: Bhatti Vikramarka: బీజేపీ నేతలు డ్రామాలు బంద్ చేయాలన్న భట్టి
భవిష్యత్ కు నాంది?
దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీ కుల గణనను పూర్తి చేసింది. దేశ వ్యాప్తంగా చేయాలని డిమాండ్ పై కూడా కాంగ్రస్ (Congress) కేంద్రంతో ప్రకటన చేయించడంలో సక్సెస్ అయింది. బీసీ(BC) ఏజెండా ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చంశనీయంగా మారాయి. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో బీసీ లీడర్లకు మరింత ప్రాధాన్యత పెరగనున్నది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రిని చేయబోతున్నామనే నినాదాన్ని కూడా భవిష్యత్ లో ఎత్తుకునే అవకాశం ఉన్నది. రాబోయే టర్మ్ లో కాంగ్రెస్ గెలిస్తే..బీసీ ను సీఎంగా ఎంపిక చేసే ఛాన్స్ లు కూడా ఉన్నాయి. ఇప్పటికే పీసీసీ చీప్ కూడా రెండు సార్లు భవిష్యత్ లో బీసీ సీఎంను చూస్తారని వ్యాఖ్యానించారు.
రాబోయే రోజుల్లో తన ప్రమోషన్
పైగా అది కాంగ్రెస్ పార్టీ నుంచే చూడబోతున్నారంటూ తాజాగా క్లారిటీ ఇచ్చారు. దీని బట్టిభవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ బీసీని సీఎంగా ఎంపిక చేసుకునే వెసులుబాటు కూడా ఉన్నది. ఈక్రమంలో ప్రస్తుతం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(PCC Mahesh Kumar Goud) రాష్ట్ర వ్యాప్తంగా చేయబోతున్న పాదయాత్ర తో కూడా ఆయనకు అవకాశాలు మెండుగా ఉండే ఛాన్స్ ఉన్నది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా, పీసీసీ చీఫ్ గా తనదైన ముద్ర వేస్తున్న మహేష్ గౌడ్కు ..ఈ పాదయాత్రలో అన్ని జిల్లాల్లోని లీడర్లు, కార్యకర్తలు, ముఖ్య నాయకులతో మరింత సత్సంబంధాలు ఏర్పడనున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి తన ప్రమోషన్ కు అత్యధికంగా ఉపయోగపడే అవకాశం ఉన్నది. ఆయన మాత్రం తనకు పార్టీ ఇచ్చిన అవకాశంలో పనిచేసుకుంటూ ముందుకు సాగుతున్నానని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ లీడర్లను గెలిపించడమే తన టాస్క్ అంటూ ఆయన వివరించారు.
Also Read; CPM: కేంద్రంలో మోడీ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకం: సాదుల శ్రీనివాస్
