Solar Power Plant (imagecredit:swetcha)
తెలంగాణ

Solar Power Plant: జీపీ నుంచి సెక్రటేరియట్.. భూముల వివరాలు పంపండి

Solar Power Plant: గ్రామపంచాయతీ భవనం నుంచి మొదలు సెక్రటేరియట్ వరకు అన్ని భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు(Solar Power plant) ఏర్పాటు చేయాలని ఉప ముఖ్​యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఆదేశించారు. సోలార్ విద్యుత్ ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Redy) నాయకత్వంలోని యావత్ కేబినెట్ విధాన నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. అంబేద్కర్(Ambedkar) సచివాలయంలో ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, ఆర్ఓఎఫ్ఆర్(ROFR) భూముల్లో ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం(Indira Solar Tribal Development Scheme) అమలుపై కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష నిర్వహించారు.

బిల్డింగ్ మొదలుకొని సెక్రటేరియట్

ఈ సందర్భంగా అన్ని కలెక్టర్ కార్యాలయాలు, పార్కింగ్(Parking), క్యాంటీన్ ప్లాన్లు హైదరాబాద్(Hyderabad) కు పంపాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లు అన్నీ కూడా ఒకే నమూనాలో నిర్మించినందున సోలార్ పవర్ ప్లాంట్ లో ఏర్పాటుకు అవసరమైన డిజైన్లు హైదరాబాదు నుంచి పంపిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. కలెక్టర్ కార్యాలయాల్లో మంచి డిజైన్లు ఉంటే ఆయా కలెక్టర్లు హైదరాబాద్ కు పంపవచ్చని డిప్యూటీ సీఎం సూచించారు. గ్రామపంచాయతీ బిల్డింగ్ మొదలుకొని సెక్రటేరియట్ వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటుచేసి పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన వివరాలకు సంబంధించి కలెక్టర్లు హైదరాబాద్(Hyderabad)కు పంపాల్సిన వివరాలకు సంబంధించి ఒక ప్రశ్నావళిని పంపిస్తున్నామని, అందులో అన్ని వివరాలు నమోదు చేసి వారం లోపు విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కార్యాలయానికి పంపాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.

Also Read: Medchal Crime: హత్యకు దారి తీసిన అప్పు వివాదం.. కత్తులతో దారుణం

విద్యాసంస్థల భవనాలపై కూడా సోలార్

ప్రభుత్వ భవనాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాల(Colleges)లు, డిగ్రీ కళాశాలలు , ఉన్నత విద్యాసంస్థల భవనాలపై కూడా సోలార్ పవర్ ప్లాంట్(Solar Power Plant) లు ఏర్పాటు చేయాలని అందుకు సంబంధించిన భవనాల వివరాలు పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ పరిధిలో పెద్ద ఎత్తున ఖాళీ స్థలాలు ఉన్నాయో వాటి వివరాలు సైతం పంపాలని కలెక్టర్లకు డిప్యూటీ సీఎం సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్ఓఎఫ్ఆర్(ROFR) చట్టం కింద 6.70 లక్షల ఎకరాల భూములను ఆనాటి కాంగ్రెస్(Congress) ప్రభుత్వం పంపిణీ చేసిందని, ఈ భూముల్లో నల్లమల డిక్లరేషన్(Nallamala Declaration) కింద ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ద్వారా ఉచితంగా సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయనున్నట్టు భట్టి కలెక్టర్లకు వివరించారు.

కలెక్టర్లు అలసత్వం ప్రదర్శించకుండా

నల్లమల డిక్లరేషన్‌లో భాగంగా ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గం లో ప్రారంభించామని, ఈ నెలలోనే ఆదిలాబాద్(Adhilabadh) జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కలెక్టర్లు అలసత్వం ప్రదర్శించకుండా వారంలోగా వివరాలు పంపాలని ఆదేశించారు. ఈ విషయాల్లో ఎలాంటి సందేహాలు ఉన్న విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఎస్పీడీసీఎల్(SPDCL), ఎన్పీడీసీఎల్(NPDCL) సీఎండీలు(CMD), రెడ్కో వీసీఎండీని సంప్రదించాలని డిప్యూటీ సీఎం కలెక్టర్లకు సూచించారు. ఈ సమీక్షలో సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Laxman Kumar), విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్(Naveen Mittal), ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ, రెడ్కో వీసీఎండీ అనిల తదితరులు పాల్గొన్నారు.

Also Read: Hyd Floods: భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టర్ కీలక నిర్ణయం

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు