Crime-News
క్రైమ్, లేటెస్ట్ న్యూస్

Karnataka Crime: వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే నేరం.. శరీర భాగాలను ముక్కలు చేసి..

Karnataka Crime: కర్ణాటకలోని ఓ చిన్నగ్రామంలో ఒళ్లు గగుర్పొడిచే నేరం వెలుగులోకి వచ్చింది. తుమకూరు జిల్లా కోరటగెరె తాలూకాలోని చింపుగనహళ్లి గ్రామంలో ఓ మహిళ అత్యంత దారుణంగా హత్యకు (Karnataka Crime) గురైంది. ఆగస్టు 7న ఒక కుక్క.. వేరైన మనిషి చేయి భాగాన్ని రోడ్డుపై ఈడ్చుకెళుతుండడాన్ని చూసిన గ్రామస్థులు భయభ్రాంతులకు లోనయ్యారు. అక్కడికి దాదాపు కిలోమీటర్ దూరంలో మరొక చేయి కనిపించడంతో అందరూ కంగుతిన్నారు. మనిషి శరీర భాగాలు కనిపించడం అంటితో ఆగలేదు.

ఆ తర్వాత, ఒక మహిళకు చెందిన తలతో పాటు వివిధ శరీర భాగాలు మొత్తం పది వేర్వేరు ప్రదేశాల్లో కనిపించాయి. సమాచారం అందడంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, కేసు దర్యాప్తు అత్యంత సంక్లిష్టంగా మారింది. ఈ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు ఇది సాధారణ హత్య కేసు కాదని నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనతో తుమకూరు జిల్లా పోలీసులు షాక్‌కు గురయ్యారు. తాలూకాలోని ప్రజల్లో కూడా భయభ్రాంతులు నెలకొన్నాయి. అయితే, ఇంతటి క్రూరమైన హత్యకు కారణం ఏమిటి?, ఎవరు చేశారన్నది పోలీసులే ఇంకా గుర్తించలేకపోయారు.

పది ప్రదేశాల్లో శరీర భాగాల వెలికితీత

ఈ దారుణమైన హత్య ఘటనలో మొదటి శరీర భాగం గురువారం ఉదయం చింపుగనహళ్లిలోని ముత్యాలమ్మ గుడి వద్ద గుర్తించారు. ఒక కుక్క పొదల్లోంచి వేరైపోయిన చేయిని లాగుతూ రోడ్డుపైకి తీసుకొచ్చింది. ఆ కాసేపటికే ప్లాస్టిక్ కవర్‌లో చుట్టిపెట్టిన మరో చేయి కూడా అదే ప్రాంతంలో బయటపడింది. ఆ తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి కొన్ని గంటల్లోనే వివిధ ప్రాంతాల్లో శరీర భాగాలను వెలికితీశారు. పేగుల భాగాలు లింగపుర రోడ్ వంతెన సమీపంలో, కడుపు భాగం, ఇతర అంతర్గత అవయవాలు బెండోనే నర్సరీ వద్ద, ఒక కాలు, రక్తంతో నిండి ఉన్న బ్యాగ్ జోనిగరహళ్లి వద్ద, శరీర భాగాలతో నింపిన రెండు బ్యాగులు సిద్ధారబెట్ట–నేగలాల్ రహదారిపై లభించాయని పోలీసులు తెలిపారు. ఇక, శుక్రవారం మధ్యాహ్న సమయంలో మృతురాలి తల సిద్ధారబెట్ట సమీపంలో గుర్తించారు. మొత్తంగా 10 వేర్వేరు ప్రదేశాల్లో నుంచి మృతురాలి శరీర భాగాలను పోలీసులు వెలికితీశారు. శరీర భాగాలు దొరికిన ప్రదేశాలు కోరటగెరె, కొలాల పోలీస్ స్టేషన్ల పరిధిలోకి వస్తాయని అధికారులు వెల్లడించారు.

Read Also- Shubman Gill: శుభ్‌మన్ గిల్ క్రేజ్ మామూలుగా లేదు… జెర్సీ వేలం వేస్తే…

డెడ్‌‌బాడీపై టాటూ ఆధారంగా గుర్తింపు
దర్యాప్తులో భాగంగా లభ్యమైన చేతులపై ఉన్న టాటూలు, ముఖ ఆకారాన్ని హత్యకు గురైంది లక్ష్మిదేవమ్మ (42) అనే మహిళగా పోలీసులు గుర్తించారు. ఆమె తుమకూరు తాలూకాలోని బెల్లావి ప్రాంతానికి చెందిన నివాసి అని పోలీసులు తెలిపారు. లక్ష్మిదేవమ్మ ఆగస్టు 4న కనిపించకుండాపోయింది. దీంతో, భర్త బసవరాజు బెల్లావి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేశాడు. లక్ష్మీ దేవమ్మ ఆగస్టు 3న ఉర్దిగేరెలో ఉన్న తన కూతుర్ని కలవడానికి వెళ్లింది. కానీ, ఆ రాత్రి ఇంటికి తిరిగి రాలేదు. ఆ మరుసటి రోజు కూడా ఆమె ఇంటికి రాలేదని భర్త తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా, లక్ష్మీదేవమ్మ రెండు రోజుల క్రితమే హత్యకు గురై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలి శరీరాన్ని ముక్కలుగా చేసి, వాటిని గుర్తించలేని విధంగా వేర్వేరు ప్రాంతాల్లో విసిరేసినట్టు భావిస్తున్నామని పేర్కొన్నారు. హత్య చేసినవారు ఎవరో, హత్యకు కారణం ఏమిటి? అనేది తెలియాల్సి ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వివరించారు.

Read Also- 500 Women Tied Rakhi: సమ్మిగౌడ్ ఫౌండేషన్ చైర్మన్ కు రాఖీలు కట్టిన 500 మంది మహిళలు

శ్రద్ధా వాకర్ కేసు గుర్తుకొచ్చింది!
చింపుగనహల్లి గ్రామంలో చోటుచేసుకున్న నేర ఘటనను చూసి చాలామందికి 2022లో దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసు గుర్తుకొచ్చింది. ఆ కేసులో, 27 ఏళ్ల శ్రద్ధా వాకర్‌ను ఆమె సహజీవన భాగస్వామి అత్యంత ఘోరంగా చంపేసి, శరీరాన్ని ముక్కలుముక్కలుగా నరికి, ఢిల్లీలోని అడవిలో పడేశాడు. కర్ణాటకలో నమోదైన తాజా కేసు కూడా దాదాపు అదేవిధంగా కనిపిస్తోంది.

Just In

01

Telugu Thalli Flyover: తెలుగు తల్లి కాదు.. తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్.. స్వాగత తోరణం ఏర్పాటు

Bathukamma 2025: సాగర తీరాన ఘనంగా సద్దుల బతుకమ్మ.. హాజరైన మంత్రులు

Hyderabad Collector: గాంధీ జయంతి ఏర్పాట్లను స్పీడప్ చేయాలి.. కలెక్టర్ హరిచందన కీలక అదేశాలు

OG New Updates: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ న్యూ అప్డేట్స్.. మళ్లీ థియేటర్లకు క్యూ కట్టాల్సిందే!

Wedding tragedy: 35 ఏళ్ల మహిళను పెళ్లాడిన 75 ఏళ్ల తాత.. తెల్లారేసరికి కన్నుమూత