MLA Matta Ragamayi ( Image Source: Twitter)
తెలంగాణ

MLA Matta Ragamayi: ప్రజా సేవా యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే మట్టా రాగమయి

MLA Matta Ragamayi: డాక్టర్ మట్టా రాగమయి, 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున సత్తుపల్లి (SC రిజర్వ్‌డ్) నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆమె బీఆర్‌ఎస్ అభ్యర్థి సంద్ర వెంకట వీరయ్యను 19,440 ఓట్ల తేడాతో ఓడించారు. MBBS, DTCD విద్యార్హతలతో, ఆమె గతంలో ప్రభుత్వ డాక్టర్‌గా పనిచేసి, సత్తుపల్లిలో క్లినిక్ ఏర్పాటు చేసి ప్రజలకు సేవలందించారు. 2014లో YSRCP నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి, 2016లో BRSలో చేరారు, ఆ తర్వాత 2023లో కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆమె తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నారు.

Also Read: Bad Girlz Movie Promotions: ఒక్కసారిగా వేసుకున్న బట్టలు విప్పిన నలుగురు హీరోయిన్లు.. షాకైన జర్నలిస్టులు

సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రజల వద్దకే ప్రజా పాలనను ఎమ్మెల్యే మట్టా రాగమయి తీసుకొస్తున్నారు. శనివారం అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులతో కలిసి మార్నింగ్ వాక్ లో గుడ్ మార్నింగ్ సత్తుపల్లి కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి మున్సిపాలిటీలోని 4 వ వార్డ్ కాకర్లపల్లి రోడ్, మసీదు రోడ్ ప్రజలతో మమేకమవుతూ సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్ట ప్రతి ఇంటి ముందుకు వెళ్లి సమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కారం చూపుతున్నారు.

Also Read: Mrunal Thakur: సీరియ‌ల్‌లో సైడ్ యాక్ట‌ర్‌గా మొదలైన మృణాల్ ఠాకూర్ ప్రస్తుత నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే ప్రజల ఇంటి వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరించడం పట్ల సత్తుపల్లి మున్సిపాలిటీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీటీ రోడ్స్, సైడ్ డ్రైన్స్ పరిశుభ్రత గురించి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తమ సమస్యలను తెలుసుకునే అప్పటికప్పుడే పరిష్కార మార్గం చూపుతున్న ఎమ్మెల్యే రాగమయి దయానంద ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీ ప్రజలు, మున్సిపాలిటీ నీ అభివృద్ధి చేస్తుండటం మాకు ఎంతో ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా ఆధ్వర్యంలో తప్పకుండా సత్తుపల్లి మున్సిపాలిటీ, నియోజకవర్గం రూపురేఖలు మారుస్తానని ఎమ్మెల్యే రాగమయి హామీ ఇష్టం తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమం లో సత్తుపల్లి ఏఎంసి చైర్మన్ దోమ ఆనంద్ బాబు, సత్తుపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సత్తుపల్లి మున్సిపాలిటీ, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read: Bad Girlz Movie Promotions: ఒక్కసారిగా వేసుకున్న బట్టలు విప్పిన నలుగురు హీరోయిన్లు.. షాకైన జర్నలిస్టులు

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు