Indian Railways (Image Souurce: Twitter)
జాతీయం

Indian Railways: సొంతూర్లకు వెళ్లే వారికి.. రైల్వేశాఖ బంపరాఫర్.. టికెట్లపై భారీ డిస్కౌంట్ ప్రకటన!

Indian Railways: దేశంలో ఫెస్టివల్ సీజన్ మెుదలుకానున్న సంగతి తెలిసిందే. వినాయక చవితి, దసరా, దీపావళి వంటి ప్రముఖ పండుగలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీ తగ్గించి.. సౌకర్యవంతమైన ప్రయాణానాన్ని అందించేందుకు భారత రైల్వేశాఖ (Indian Railway) కీలక నిర్ణయం తీసుకుంది. ‘రౌండ్ ట్రిప్ ప్యాకేజీ ఫర్ ఫెస్టివల్ రష్’ (Round Trip Package For Festival Rush) అనే కొత్త స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ద్వారా సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులు.. రెండు వైపులా (వెళ్లే మరియు తిరిగి వచ్చే) టికెట్లను ఒకేసారి బుక్ చేసుకునే అవకాశం లభించనుంది. అంతేకాదు రిటర్న్ టికెట్ పై 20% రాయితీని సైతం రైల్వే శాఖ అందించబోతోంది. ఈ స్కీమ్ కు సంబంధించిన సమగ్ర వివరాలు ఇలా ఉన్నాయి.

స్కీమ్ ముఖ్య లక్షణాలు

1. 20% డిస్కౌంట్

❄️ రౌండ్ ట్రిప్ టికెట్లను (వెళ్లే మరియు తిరిగి వచ్చే) ఒకే పేరు, వివరాలతో ప్రయాణికులు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లోనే రిటర్న్ టికెట్‌ ప్రాథమిక ఛార్జీలపై 20% తగ్గింపు లభిస్తుంది.

❄️ ఉదాహరణకు ఒక టికెట్ ధర రూ.1000 అయితే.. రిటర్న్ టికెట్ ధర రూ.800కి లభిస్తుంది.

2. ప్రయాణ తేదీలు

రౌండ్ ట్రిప్ ప్యాకేజీ కింద టికెట్లను బుక్ చేసుకునే తేదీలను సైతం రైల్వే శాఖ ప్రకటించింది.

❄️ వెళ్లే టికెట్: 2025 అక్టోబర్ 13 నుండి అక్టోబర్ 26 వరకు.

❄️ తిరిగి వచ్చే టికెట్: 2025 నవంబర్ 17 నుండి డిసెంబర్ 1 వరకు.

❄️ ఈ తేదీలలో మాత్రమే ప్రయాణం చేయడానికి టికెట్లు బుక్ చేసుకోవాలి.

3. బుకింగ్ షరతులు

❄️ రెండు టికెట్లు ఒకే తరగతి (క్లాస్), ఒకే స్టేషన్ జత (Origin-Destination Pair) కోసం ఉండాలి.

❄️ రిటర్న్ టికెట్ బుక్ చేసేటప్పుడు అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP) నియమం వర్తించదు.

❄️ టికెట్లు ఒకే మాధ్యమం (ఆన్‌లైన్ లేదా రిజర్వేషన్ కౌంటర్) ద్వారా బుక్ చేయాలి.

❄️ రెండు టికెట్లు ధృవీకరించబడినవి (Confirmed) అయి ఉండాలి.

4. నిబంధనలు

❄️ టికెట్‌లో ఎటువంటి మార్పులు (Modification) చేయడానికి అనుమతి లేదు.

❄️ రిటర్న్ టికెట్ రద్దు (Cancellation) సౌకర్యం లేదు.

❄️ ఇతర డిస్కౌంట్లు, వోచర్లు, పాస్‌లు, PTO లేదా రైలు ప్రయాణ కూపన్‌లు ఈ స్కీమ్‌కు వర్తించవు.

❄️ ఫ్లెక్సీ ఫేర్ (Flexi Fare) ఉన్న రైళ్లలో ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉండదు.

5. స్కీమ్ వర్తించే రైళ్లు 

ఈ స్కీమ్ అన్ని తరగతులకు (AC, స్లీపర్, జనరల్), అలాగే అన్ని రైళ్లకు వర్తిస్తుంది. ప్రత్యేక రైళ్లలోనూ దీనిని ఉపయోగించుకోవచ్చు (ఫ్లెక్సీ ఫేర్ రైళ్లు మినహా).

ఎవరికి ప్రయోజనకరం

❄️ పండుగ సీజన్‌లో తమ స్వస్థలాలకు వెళ్లి తిరిగి వచ్చే ప్రయాణికులు.

❄️ రెండు వైపులా ధృవీకరించబడిన టికెట్లను కోరుకునే వారు.

❄️ ఆర్థికంగా లాభదాయకమైన ప్రయాణ ఎంపికలను ఆశించే వారు.

Also Read: 3000 Year Old Skeletons: 3000 ఏళ్ల క్రితం జరిగిన బలిదానాలు.. బయటపడ్డ 14 అస్థిపంజరాలు.. ఎక్కడంటే?

ముఖ్య గమనికలు

❄️ ఈ స్కీమ్‌ను ఉపయోగించుకోవాలంటే, రెండు టికెట్లను ఒకే సమయంలో బుక్ చేయాలి.

❄️ టికెట్ రద్దు సౌకర్యం లేనందున ప్రయాణ షెడ్యూల్‌ను ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి.

❄️ మరిన్ని వివరాల కోసం IRCTC అధికారిక వెబ్‌సైట్ (www.irctc.co.in) (www.irctc.co.in) లేదా సమీప రిజర్వేషన్ కౌంటర్‌ను సంప్రదించవచ్చు.

Also Read This: Modi Trump Salaries: ట్రంప్ వర్సెస్ మోదీ.. ఎవరి జీతం ఎంతో తెలుసా?

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు