Jangaon district: గానుగుపాడు వాగుపై అసంపూర్తిగా నిర్మాణం చేసిన బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి గానుగుపాడు బ్రిడ్జి వద్ద దర్నా చేపట్టి, బ్రిడ్జి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మోకు మాట్లాడుతూ జనగామ నుంచి హుస్నాబాద్‌కు వెళ్ళే రోడ్డులో ఉన్న గానుగుపాడు వాగు వద్ద గత రెండేళ్ల క్రితం పనులు చేపట్టారన్నారు.
Also Read:Jogulamba Gadwal: వర్షంతో జీవం పోసుకున్న పంటలు.. రైతన్నల ముఖాల్లో వెలుగులు
ఆవేదన వ్యక్తం
ఈ రూటులో నర్మెట్ట, తరిగొప్పుల మండలాలతో పాటుగా కరీంనగర్, వేములవాడ, హుస్నాబాద్ వంటి ప్రాంతాలకు లింక్ రోడ్డుగా ఉందన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. దీని నిర్మాణంలో జరుగుతున్న జాప్యంతో ప్రజలు, వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బ్రిడ్జిని అసంపూర్తిగా వదిలేయడంతో ప్రమాదాలు జరిగి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలవుతున్న బ్రిడ్జిని పట్టించుకోకపోవడం విచిత్రంగా ఉందన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషాను కలిసి సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
Also Read:CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవనం ఎంతో అవసరం.. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి