Kaleshwaram Report: తండ్రి కోసం కూతురు న్యాయపోరాటానికి సిద్ధమవుతుంది. కాంగ్రెస్(Congress) విమర్శల నుంచి కేసీఆర్(Kcr)ను బయటపడేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది. కాళేశ్వరం నివేదికపైనా న్యాయపోరాటం చేయాలని భావిస్తుంది. అందుకు అవసరమైన చర్యలపై కసరత్తు చేస్తుంది. ఏ అవకాశాన్ని వదులుకోవద్దని, గతంలో న్యాయస్థానాల్లో అప్పీల్లు, న్యాయస్థానాలపై వెలువరించిన తీర్పులపైనా చర్చిస్తున్నారు. త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు సమాచారం.
ఆరోపణలు తిప్పికొట్టాలని
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ (Congrss) ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ వేయగా ప్రభుత్వానికి ఆ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఆ కమిషన్ నివేదికపై క్యాబినెట్‌లో చర్చించారు. అయితే 665 పేజీల నివేదికలో 32 సార్లు కేసీఆర్ పేరు ప్రస్తావించినట్లు, మేడిగడ్డ కూలడానికి కేసీఆర్ కారణమని పేర్కొంది. అసెంబ్లీలోనూ చర్చించేందుకు సిద్ధమవుతుంది. సిట్ వేయాలని భావిస్తుంది. ఈ తరుణంలోనే బీఆర్ఎస్ సైతం కమిషన్ నివేదికను, ప్రభుత్వాన్ని తప్పుబడుతుంది. అది కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదు.. కాంగ్రెస్ నివేదిక అని విమర్శలకు పదును పెట్టింది. లక్షల ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్టును నిర్మిస్తే 2 పిల్లర్స్ కూలడంతో రాద్దాంతం చేస్తుందని మండిపడుతుంది.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ
కేసీఆర్(KCR)ను టార్గెట్‌గా కాంగ్రెస్(Congress)పావులు కదుపుతుందని మండిపడుతుంది. కాంగ్రెస్( Congress) ప్రభుత్వం కావాలని కమిషన్ నివేదికతో బీఆర్ఎస్(BRS) అధినేత, తన తండ్రి కేసీఆర్(Brs)ను బద్నాం చేయాలని ప్రయత్నం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత(Kavith) ఆరోపిస్తుంది. కుట్రపూరితంగా చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టాలని భావిస్తుంది. అందుకోసం న్యాయపోరాటానికి సన్నద్ధమవుతోంది. కాళేశ్వరం కమిషన్ (పీసీ ఘోష్ కమిషన్) నివేదికపై న్యాయ నిపుణులతో రెండు రోజులుగా భేటీ అవుతూ సమీక్షిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలి.. నివేదికలో కేసీఆర్ పేరును అత్యధికంగా పేర్కొనడానికి గల కారణాలు.. తదితర అంశాలను సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ప్రభుత్వం చేసే బద్నాంను ఎలా తిప్పికొట్టాలి.. ప్రజల్లో కేసీఆర్ ఘనతను చాటిచెప్పేలా చేసే అంశాలను సైతం కవిత ఆరా తీస్తున్నట్లు సమాచారం. తెలంగాణను సాధించిన వ్యక్తిగా, పదేళ్లలో చేసిన అభివృద్ధిని వివరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది.
న్యాయపోరాటం చేయాలని నిర్ణయం
పీసీ ఘోష్ కమిషన్ 665 పేజీలతో కూడిన నివేదిక ఇస్తే అందులో తమకు అనుకూలంగా ఉన్న అంశాలనే రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్‌లో చర్చించిందని, నివేదికను అధ్యయనం చేసేందుకు వేసిన కమిటీ సైతం 60పేజీలతో సంక్షిప్తంగా వివరాలు ఇచ్చింది. ఈ 60పేజీల్లోనూ కేసీఆర్ పేరును ఎక్కువ సార్లు ప్రస్తావించడంతో ఇది కేవలం గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ లక్ష్యంగానే ముందుకు సాగుతుందని బీఆర్ఎస్ పేర్కొంటుంది. ఉద్దేశ పూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్‌ను అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తోందని.. ఆయనపై అవినీతి ముద్ర వేయడానికి చేసే ప్రయత్నాలను న్యాయ పరంగానే తిప్పికొట్టాలని కవిత నిర్ణయం తీసుకొని ముందుకు సాగేందుకు సిద్ధమవుతుందని అమె అనుచరులు పేర్కొంటున్నారు.
దేశంలో ఇప్పటి వరకు వేసిన జ్యూడిషియల్ కమిషన్‌లు.. వాటి నివేదికలు.. ఆయా నివేదికలపై న్యాయస్థానాల్లో అప్పీల్లు.. వాటిపై న్యాయస్థానాలు వెలువరించిన తీర్పులపై కవిత న్యాయ నిపుణులతో చర్చించినట్లు తెలిసింది. న్యాయపోరాటానికి అనుకూలంగా ఉన్న అంశాలపై చర్చించినట్టుగా సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ, కౌన్సిల్‌లో కమిషన్ తుది నివేదిక సమర్పించిన తర్వాత న్యాయపోరాటం చేయాలని నిర్ణయించినట్టుగా విశ్వసనీయ సమాచారం.
కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర
ఇప్పటికే కేసీఆర్(KCR)కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇందిరా పార్కు సమీపంలో ధర్నా చౌక్‌లో ధర్నా చేపట్టారు. కేసీఆర్(KCR) ను కావాలని కాంగ్రెస్(Congrrss) ప్రభుత్వం బద్నాం చేయాలనే కుట్రలు చేస్తుందని కవిత ఆరోపించారు. పలు సందర్భాల్లోనూ ఇటు ప్రభుత్వాన్ని, అటూ కమిషన్ తీరును తప్పుబట్టారు. అయితే ఒకవైపు ప్రభుత్వ తీరును ఎండగడుతూనే కాళేశ్వరం కమిషన్ పై న్యాయపోరాటం చేయాలని, కేసీఆర్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే కేసీఆర్ టార్గెట్ గా ప్రభుత్వం పావులు కదుపుతుందని కవిత ఆరోపణలకు పదును పెట్టింది.
బీఆర్ఎస్‌నూ సైతం కదిలించేలా?
కాళేశ్వరం కమిషన్ కేసీఆర్(KCR) కు నోటీసులు ఇవ్వడంపై తొలిసారిగా ఎమ్మెల్సీ కవిత(Kavitah) తీవ్రంగా స్పందించారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆమరణ దీక్ష చేసి తెలంగాణను సాధించడంతో పాటు 10ఏళ్లు తెలంగాణను అభివృద్ధి పథంలో నిలిపిన కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? అని ప్రశ్నించారు. అంతేకాదు సొంతపార్టీ బీఆర్ఎస్(Brs) స్పందించకపోవడంపైనా ఘాటుగా స్పందించింది. నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా ఏం చేస్తున్నారని నిలదీసింది. మళ్లీ ఇప్పుడు ప్రభుత్వం సిట్ వేసి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సిద్ధమవుతుండడంతో ముందస్తుగానే కేసీఆర్‌ను కాపాడాలనే ప్రయత్నాలు చేస్తుంది.
అందులో భాగంగానే సీనియర్ న్యాయవాదులు, న్యాయనిపుణులతో భేటీ అవుతూ న్యాయ సలహాలు తీసుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కేసీఆర్‌పై కక్షగట్టిందని న్యాయస్థానాలతోనే ఆ అంశాన్ని వెల్లడించాలని కవిత భావిస్తుంది. అయితే కవిత ఇప్పుడు మళ్లీ తీసుకుంటున్న చర్యలను గులాబీ పార్టీని, క్యాడర్‌ను కదలించనుంది. పార్టీ సైతం కావల్సిన ప్రయత్నాలు చేపట్టేలా కదిలించే ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైన కవిత(Kavitha) తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read: PM Modi: డైరెక్ట్‌గా డొనాల్డ్ ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చిన ప్రధాని మోదీ
