Congress Party Govt( IMAGE CREDIT: TWITTER)
Politics

Congress Party Govt: రిజర్వేషన్లు గ్రామాల్లో పరిస్థితిపై సర్కార్ ఆరా

Congress Party Govt: స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరపున ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై కాంగ్రెస్(Congres)  త్వరలోనే చర్చించనున్నది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతి, గవర్నర్‌లకు పంపిన బిల్లులు, ఆర్డినెన్స్ పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో తదుపరి యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. 42 శాతం రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలనే అంశంపై అధ్యయనం చేస్తున్నది. త్వరలోనే పొలిటికల్ ఆఫైర్స్ కమిటీ మీటింగ్‌ను నిర్వహించేందుకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌(Mahesh Kumar Goud)కు ఆదేశాలిచ్చారు.

ఆ మీటింగ్‌లో సీనియర్ నాయకులు, బీసీ సంఘం ముఖ్యనాయకులంతా హాజరు కానున్నారు. ఆయా నేతల నుంచి బీసీ రిజర్వేషన్లపై ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. దాని ప్రకారమే ముందుకు వెళ్లాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే, ప్రభుత్వం పార్టీ ముందు మూడు ఆప్షన్లను పెట్టింది. కేంద్రం ఆమోదం తెలిపే వరకు వేచి ఉండడం, జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లడం, పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం, ఈ మూడు అంశాలపై ఎక్స్‌పర్ట్, పార్టీ సీనియర్లు, బీసీ సంఘం ముఖ్య నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ జరగనున్నది.

 Also Read: Kapil Sharma Cafe: మళ్లీ కపిల్ శర్మ కేఫ్‌పై కాల్పుల మోత.. 25 రౌండ్లు కాల్పులు! వారి పనే!

లీగల్ చిక్కులపై
ఇక ప్రభుత్వం జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్తే, కోర్టుల నుంచి ఎదురయ్యే సమస్యలను అధ్యయనం చేసేందుకు లీగల్ ఎక్స్‌పర్ట్ కమిటీని కూడా వేయనున్నారు. అడ్వకేట్ జనరల్ నుంచి కూడా ప్రభుత్వం సలహాలు సూచనలను పరిగణలోకి తీసుకోనున్నది. ఆయా అంశాలన్నింటినీ పీఏసీలో చర్చించనున్నారు. సెప్టెంబర్ 30 కల్లా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని కోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో పీఏసీలో సరైన నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్(Congress) అంతర్గతంగా ఆందోళన పడుతున్నది. దీంతో పాటు రిజర్వేషన్లపై గ్రామాల్లో ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం గురించి ఫీడ్ బ్యాక్ ఎలా ఉన్నదనే విషయాలను కూడా పీఏసీలో చర్చించనున్నారు.

జనాలను కన్విన్స్ చేయడం ఎలా?
స్థాథానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయలేని పరిస్థితుల్లో జనాలను ఎలా కన్విన్స్ చేయాలనే అంశంపై కూడా పీఏసీలో డిస్కషన్ చేయనున్నారు. కేంద్రం ప్రభుత్వం నిర్లక్ష్యం కారణాన బిల్లు, ఆర్డినెన్స్‌లకు బ్రేకులు పడినా.. ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయానే ఫీలింగ్ కాంగ్రెస్‌లో ఉంటుంది. క్షేత్రస్థాయి నేతల్లోనూ అదే భావన నెలకొంటుంది. దీంతో పబ్లిక్‌ను కన్విన్స్ చేయడం కూడా కష్టమే. ఒక వేళ పార్టీ నుంచి 42 శాతం సీట్లు చొప్పున కేటాయించినా, అధికార పార్టీకి విమర్​శల పాలు తప్పదు.

కేంద్రం నుంచి క్లియరెన్స్ రాలేదని ముందే తెలిసినా.. కాంగ్రెస్ గేమ్‌ ఆడిందనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వస్తాయి. బీసీ సంఘాల నుంచి కూడా వచ్చే ప్రమాదం ఉన్నది. దీంతో బీసీ రిజర్వేషన్లను ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దానిపై స్టేట్ కాంగ్రెస్ అగ్రనేతలు అంతర్గతంగా ఆందోళన పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పీఏసీ‌లో పార్టీ బీసీ ముఖ్య నాయకులతో పాటు సీనియర్ నాయకులను భాగస్వామ్యం చేసి సమన్వయంగా అభిప్రాయాలను క్రోడీకరించనున్నారు. దాని ప్రకారమే ముందుకు సాగాలనే తదుపరి ప్రణాళికను పార్టీ రెడీ చేసుకుంటున్నది.

 Also Read: TG School Holidays: అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు సెలవు.. తేదీలు ఇవే!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!