Strange Incident (Image Source: AI)
Viral, లేటెస్ట్ న్యూస్

Strange Incident: డబుల్ షాక్.. కవలలకు యువతి ప్రసవం.. బిడ్డల తండ్రులు కూడా వేర్వేరు!

Strange Incident: ప్రవసం అనేది స్త్రీలలో సర్వ సాధారణమైన విషయం. అయితే కొందరు మాత్రం అరుదుగా కవలలు జన్మనిచ్చి ఆశ్చర్యపరుస్తుంటారు. ఒకే రూపం, ఒకే జెండర్ కలిగిన బిడ్డలకు పలువురు మహిళలు జన్మనివ్వడం అప్పుడప్పుడు వార్తల్లో చూస్తూనే ఉంటాం. కొందరు ముగ్గురు ట్విన్స్ కు సైతం జన్మనిచ్చిన ఘటనలు ఉన్నాయి. అయితే ఓ మహిళ ఇద్దరు కవలలకు జన్మనిచ్చి.. డాక్టర్లు సైతం ఉలిక్కిపడేలా చేసింది. ఆ ఇద్దరు బిడ్డల తండ్రులు వేర్వేరు వ్యక్తులు కావడం చూసి వైద్యులు సైతం అవాక్కయ్యారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఇది ఎలా సాధ్యమైంది? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎక్కడ జరిగిందంటే?
బ్రెజిల్ కు చెందిన 19 ఏళ్ల యువతి ఇద్దరు పండంటి బిడ్డలకు జన్మనిచ్చింది. కొన్ని కారణాల రిత్యా ఇద్దరు బిడ్డలకు డీఎన్ఏ పరీక్ష చేయగా వారి తండ్రులు వేరని తేలింది. ఇది చూసి వైద్య సిబ్బంది సైతం ఖంగు తిన్నారు. ఈ తరహా ఘటన వైద్య చరిత్రలోనే చాలా అరుదైనదిగా పేర్కొన్నారు. వైద్య శాస్త్రం ప్రకారం.. ఈ విధమైన ప్రసవాన్ని సూపర్‌ఫెకండేషన్ (Superfecundation) అంటారని వైద్యులు తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Just24india (@just24india)

సూపర్‌ఫెకండేషన్ అంటే ఏమిటి?
స్త్రీ, పురుషుల కలయిక సందర్భంగా పురుషుడిలో విడుదలైన శుక్రకణం.. మహిళ గర్భాసయంలోని అండాన్ని తాకినప్పుడు గర్భధారణ జరుగుతుంది. కానీ సూపర్‌ఫెకండేషన్‌ లో ఇందుకు కాస్త భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. దీని ప్రకారం ఒకే నెలలో మహిళలో రెండు అండాలు విడుదలవుతాయి. ఆ సమయంలో వేర్వేరు పురుషులతో సదరు స్త్రీ లైంగిక సంబంధం ఏర్పడినప్పుడు రెండు అండాలకు వేర్వేరు వ్యక్తుల శుక్రకణాలు జతయ్యే అవకాశం ఉంటుంది. ఈ సందర్భాల్లో ఇద్దరు భిన్న తండ్రుల నుంచి ఇద్దరు పిల్లలు పుడతారు.

యువతి విషయంలో జరిగిందిదే..
బ్రెజిల్ యువతి విషయానికి వస్తే ఆమె విషయంలోనూ సూపర్‌ఫెకండేషన్ తరహా పరిస్థితులే జరిగాయి. ఆమె రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు వ్యక్తులతో లైంగిక సంబంధాన్ని పెట్టుకుంది. అనంతరం ఆమె గర్భం దాల్చి.. 9 నెలల తర్వాత కవలలకు జన్మనిచ్చింది. అయితే ఆమెకు అప్పటికే వివాహం కావడం.. పుట్టిన బిడ్డలో ఒకరికి తండ్రి పోలిక లేకపోవడంతో ఆమె భర్త షాక్ కు గురయ్యాడు. అనుమానంతో బిడ్డలకు డీఎన్ఏ పరీక్ష చేయించగా.. ఒక బిడ్డకు తండ్రి తాను కాదని తేలింది.

Also Read: TG School Holidays: అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు సెలవు.. తేదీలు ఇవే!

10 లక్షల్లో ఒకరికీ..
అయితే ఈ తరహా ప్రసవం.. ప్రతీ 10 లక్షల గర్భధారణల్లో ఒకరికే జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. దీనిని మెడికల్ లిటరేచర్ ప్రకారం ‘హెటెరోపాటర్ల్ సూపర్‌ఫెకండేషన్’ (Heteropaternal superfecundation) అని కూడా అంటారని స్పష్టం చేశారు. ఈ సందర్భాల్లో భార్య భర్తల మధ్య విభేదాలు తలెత్తి.. విడాకుల వరకూ వెళ్లిన ఘటనలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నారు. తాజాగా బ్రెజిల్ యువతి విషయంలోనూ ఇదే జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Also Read This: Rakhi Gift for PM Modi: ప్రధాని మోదీకి రాఖీ పంపిన పాక్ మహిళ.. అది కూడా ‘ఓం’ చిహ్నంతో..!

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు