TG School Holidays (Image Source: Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

TG School Holidays: అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు సెలవు.. తేదీలు ఇవే!

TG School Holidays: సాధారణంగా స్కూల్ విద్యార్థులు.. ఒకరోజు సెలవు దొరికిందంటేనే ఎగిరి గంతేస్తారు. అలాంటిది వరుసపెట్టి సెలవులు వస్తే.. వారి ఆనందం ఏ స్థాయికి చేరుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆగస్టు 2025 (August 2025 Holidays) నెల విషయానికి వస్తే ఇదే జరిగింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది రోజుల పాటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. ఇంతకీ ఈ సెలవులు ఎందుకు? ఏ రోజుల్లో లభించనున్నాయి? వంటి పూర్తి విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆగస్టు 2025లో స్కూల్ సెలవులు
ఆగస్టు 8 (శుక్రవారం):
వరలక్ష్మీ వ్రతం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకూ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఆ రోజు గౌరీ లేదా లక్ష్మీదేవిని మహిళలు పూజిస్తారు.

ఆగస్టు 9 (శనివారం): రక్షా బంధన్ (రాఖీ పౌర్ణమి) సందర్భంగా ఈ రోజును సెలవుగా ప్రకటించారు. పైగా రెండో శనివారం (Second Saturday) కూడా కావడంతో చాలా స్కూళ్లల్లో సెలవుగా నిర్ణయించారు.

ఆగస్టు 10 (ఆదివారం): ఆదివారం సాధారణంగానే స్కూళ్లకు హాలీడే. అయితే ఆదివారం కూడా కలుపుకుంటే వరుసగా స్కూళ్లకు 3 రోజులు హాలీడేస్ రావడం గమనార్హం.

ఆగస్టు 15 (శుక్రవారం): ప్రతీ ఏటా ఈ రోజున స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. ఆ రోజు స్కూళ్లు, కాలేజీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సైతం సెలవు. ఆ రోజు ఉదయం జాతీయ జెండా వందనం చేసిన తర్వాత విద్యార్థులను ఇళ్లకు పంపేస్తుంటారు.

ఆగస్టు 16 (శనివారం): శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని చాలా వరకూ స్కూళ్లకు ఆ రోజున హాలీడే ఉంది. హిందువులు జరుపుకునే ప్రముఖమైన పండుగల్లో ఇది కూడా ఒకటి.

ఆగస్టు 17 (ఆదివారం): సాధారణ సెలవు రోజు. అయితే ఈ ఆదివారం కలుపుకొని కూడా వరుసగా మూడ్రోజుల పాటు విద్యార్థులకు సెలవులు రావడం విశేషం.

ఆగస్టు 27 (బుధవారం): వినాయక చవితి సందర్భంగా ఈ రోజును హాలీడేగా ప్రభుత్వం ప్రకటించింది. హిందువులు అతిభారీగా జరుపుకునే పండగల్లో గణేష్ చవితి ఒకటి.

ఆగస్టు 31 (ఆదివారం): ఆ రోజు ఆదివారం సందర్భంగా సెలవు.

Also Read: Viral Video: ఎవడ్రా వీడు.. ఆయిల్ ప్యాకెట్ కట్ చేయకుండా, నూనెలో కరిగించి బజ్జీలు.. వీడియో వైరల్

ఇప్పటికే కొన్ని సెలవులు: ఆగస్టులోకి ఇప్పటికే ఎంటర్ అయిన నేపథ్యంలో ఈ నెల 3వ తేదీన ఆదివారం రూపంలో విద్యార్థులకు సెలవు లభించింది. అలాగే ఆగస్టు 5న తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. వీటన్నింటిని కలుపుకుంటే ఈ నెలలో దాదాపు 10 రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు లభించినట్లైంది.

Also Read This: Rakhi Gift for PM Modi: ప్రధాని మోదీకి రాఖీ పంపిన పాక్ మహిళ.. అది కూడా ‘ఓం’ చిహ్నంతో..! 

Also Read This: Youth Issues: యువతను వేధిస్తున్న కొత్త సమస్య.. 30 ఏళ్ల లోపు వారు ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతి

Just In

01

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!