Bandi Sanjay on Congress: ముస్లింలకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకే కాంగ్రెస్ న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తోందే తప్పా బీసీల కోసం కానేకాదని, కామారెడ్డి డిక్లరేషన్(Kamareddy Declaration) పై కాంగ్రెస్ మాట తప్పిందని, మైనారిటీ ఓట్ల కోసం ముస్లిం డిక్లరేషన్ ను అమలు చేయాలనుకుంటోందని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఒక ప్రకటనలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ బీసీలను ఘోరంగా మోసం చేస్తోందని, అందుకే కాంగ్రెస్(Congress)ధర్నాకు బీసీల మద్దతు కరువైందన్నారు.
Also Read: Youth Issues: యువతను వేధిస్తున్న కొత్త సమస్య.. 30 ఏళ్ల లోపు వారు ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతి
బీసీలకు ఏ పార్టీ ఏం చేసింది
వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బీసీలకు 27 శాతం రిజర్వేషన్లను అమలుచేస్తోందని, కాంగ్రెస్(Congress) తెచ్చిన బీసీ బిల్లువల్ల బీసీలకు ఒరిగేది 5 శాతం రిజర్వేషన్లు మాత్రమేనని చెప్పుకొచ్చారు. పక్కా ప్లాన్ ప్రకారమే తెలంగాణలో మెజారిటీ హిందువులను మైనారిటీలుగా చేసే కుట్ర చేస్తోందని విరుచుకుపడ్డారు. బీసీల ముసుగులో ముస్లింలకు 100 శాతం రిజర్వేషన్లను అమలుచేయాలనే కుట్ర జరుగుతోందన్నారు. బీసీలకే పూర్తిగా 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తేనే మద్దతిస్తామని లేదంటే తప్పనిసరిగా ఈ బిల్లును అడ్డుకుని తీరుతామని బండి హెచ్చరించారు. బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందనే అంశంపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని బండి సవాల్ విసిరారు. కేంద్రంపై నెపం మోపి బీసీ రిజర్వేషన్ల(BC Reservations) నుంచి తప్పుకోవాలనుకుంటున్న కాంగ్రెస్.. యూపీ, బెంగాల్, బీహార్ తరహాలోనూ తెలంగాణలోనూ కనుమరుగవడం తథ్యమని పేర్కొన్నారు.