Medchal Crime: అప్పు తగాదా హత్యకు దారి తీసింది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులను పోలీసులు 24గంటల్లోనే అరెస్ట్ చేశారు. బాలానగర్(Balanagar) ఏసీపీ నరేశ్ రెడ్డి తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా(Medchal Malkajgiri District)ఎల్లమ్మబండ నివాసి, స్ర్కాప్ వ్యాపారి అయిన సయ్యద్ ఫాజెల్ తన సోదరునితో కలిసి స్నేహితుడైన మహబూబ్ కు అయిదేళ్ల క్రితం 11లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఎన్నిసార్లు అడిగినా మహబూబ్ అప్పుగా తీసుకున్న డబ్బు వాపస్ ఇవ్వలేదు.
Also Read: Gadwal: నూతన రేషన్ కార్డులతో నెరవేరిన పేదల కల
పైగా డబ్బు కోసం ఒత్తిడి తెస్తే చంపేస్తానంటూ సయ్యద్ ఫాజెల్ ను బెదిరించాడు. ఈ క్రమంలో సయ్యద్ ఫాజెల్ తన మేనల్లుడు సయ్యద్ జహంగీర్, అతని స్నేహితులు షేక్ కరీం, షేక్ అమీర్ లతో కలిసి మహబూబ్ ను హత్య చేయాలని పథకం వేశాడు. దాని ప్రకారం సాయంత్రం 4గంటలకు మహబూబ్ ను ఎల్లమ్మబండ ప్రాంతానికి రమ్మన్నాడు. ఈ క్రమంలో మహబూబ్ ఇద్దరు స్నేహితులతో కలిసి అక్కడికి వచ్చాడు. అంతా కలిసి గుడ్ విల్ రెస్టారెంట్ కు వెళ్లారు.
డబ్బు విషయమై గొడవ
అక్కడ మరోసారి సయ్యద్ ఫాజెల్, మహబూబ్ మధ్య డబ్బు విషయమై గొడవ జరిగింది. దాంతో సయ్యద్ ఫాజెల్, సయ్యద్ జహంగీర్, షేక్ కరీం, షేక్ అమీర్ లు కలిసి కత్తులతో మహబూబ్ పై దాడి చేసి విచక్షణారహితంగా పొడిచారు. దాంతో మహబూబ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన సీఐ(CI) నర్సింహ, డీఐ నరేంద్ర రెడ్డి, బాలానగర్(Balanagar) ఎస్వోటీ పోలీసులతో కలిసి విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. నలుగురు నిందితులను ఆల్విన్ కాలనీలోని ఆర్ఆర్ఆర్ వైన్స్ వద్ద అరెస్ట్ చేశారు.
Also Read: CM Revanth protest: పేరు బంధంతో పాటు పేగు బంధం తెంచుకుందాం: రేవంత్ రెడ్డి